Brick | ఈ ఇటుక కాస్ట్‌లీ గురు.. ఒక్కో బ్రిక్ ధర రూ. 50..!
Brick | ఇటుక( Brick ) అందరికీ తెలిసిన వస్తువే. ఏ చిన్న నిర్మాణం జరిగినా ఇటుకను ఉపయోగిస్తారు. ఇక దీని ధర విషయానికి వస్తే.. రూ. 10 నుంచి రూ. 20 వరకు ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇటుక వెరీ కాస్ట్‌లీ. ఒక్కో ఇటుక ధర రూ. 50 అట. మరి అంత ఖరీదైన ఇటుక ఎక్కడుందో తెలుసుకుందాం..

Brick | మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని షాడోల్ జిల్లాలో ఓ గ్రామపంచాయతీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే.. ఆ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన ఓ నిర్మాణానికి సంబంధించిన బిల్లు విషయంలో. మరి ఆ బిల్లులో అంతగా ఏముందంటే.. ఒక్కో ఇటుక( Brick ) ధర రూ. 50గా నిర్ణయించారు.
షాడోల్ జిల్లా బుధ్‌హర్ బ్లాక్ పరిధిలోని భటియా గ్రామపంచాయతీ పరిధిలోని ఓ అంగన్‌వాడీ( Anganwadi ) భవనం ప్రహరీ గోడ కోసం ఇటుకను కొనుగోలు చేశారు. మొత్తం 2500 ఇటుకలను కొనుగోలు చేయగా, బిల్లును రూ. 1.25 లక్షలకు ఫైనల్ చేశారు. అంటే ఒక్కో ఇటుక ఖరీదు రూ. 50 పడ్డట్టు. ఈ ధర సాధారణ ధర కంటే పది రెట్లు ఎక్కువ అని స్థానికులు పేర్కొన్నారు.
రూ. 1.25 లక్షల బిల్లుపై గ్రామ సర్పంచ్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా సంతకం చేసి ఆమోదించారు. అనంతరం బిల్లులు మంజూరు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇటుకలకు సంబంధించిన బిల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక యువత, గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.