Sanitation Job | సఫాయి ఉద్యోగం కోసం.. తల్లి బంగారు ఆభరణాలు తాకట్టు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Sanitation Job | అతనో నిరుద్యోగి( Un Employee ).. చివరకు సఫాయి ఉద్యోగమైనా(Sanitation Job )దక్కించుకోవాలనుకున్నాడు. అందుకోసం అతను తల్లి( Mother ) బంగారు ఆభరణాలను( Gold Ornaments ) తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బును లంచం( Bribe )గా ఇచ్చాడు. కానీ చివరకు మోసపోయాడు ఆ నిరుద్యోగి.
Sanitation Job | ముంబై : ఓ నిరుద్యోగి(Un Employee ) సఫాయి ఉద్యోగం( Sanitation Job )కోసం భారీగా లంచం( Bribe ) ఇచ్చాడు. అది కూడా తన తల్లి( Mother ) బంగారు ఆభరణాలు( Gold Ornaments ) తాకట్టు పెట్టి. మూడు నెలల పాటు సఫాయి ఉద్యోగం చేసినా.. చిల్లి గవ్వ కూడా చేతికి అందలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి.. పోలీసులకు( Police ) ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై( Mumbai )లోని వకోలా పోలీసు స్టేషన్ పరిధిలోకి ప్రథమేష్ విచారే అనే వ్యక్తి నిరుద్యోగి. అయితే బృహణ్ ముంబై కార్పొరేషన్‌లో సఫాయి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. 2018లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన నగేశ్ పవార్‌ను విచారే ఇటీవలే సంప్రదించాడు. సఫాయి ఉద్యోగం కోసం పవార్ రూ. 8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో విచారే తన తల్లి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి.. రూ. 8 లక్షలు తీసుకొచ్చి పవార్‌కు అందజేశాడు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చి.. బ్యాంక్ ఖాతా కూడా ఓపెన్ చేయించాడు. ఇక బీఎంసీ హెచ్ వెస్ట్ వార్డులో విచారేకు సఫాయి ఉద్యోగంలో చేర్పించాడు. మూడు నెలల పాటు సఫాయి ఉద్యోగం చేస్తూ వచ్చాడు విచారే. అయితే మూడు నెలల నుంచి జీతం రాకపోవడంతో పవార్‌ను విచారే సంప్రదించాడు. తాను పెట్టించిన ఉద్యోగస్తుల విషయంలో ఓ వ్యక్తి ఆర్టీఐ దాఖలు చేశాడని, దాంతో విచారణ కొనసాగుతుందని చావు కబురు చల్లగా చెప్పాడు పవార్. దీంతో తాను మోసపోయానని గ్రహించిన విచారే.. వకోలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram