Woman attack | ఆ విషయంలో ఫెయిల్..! విటుడిని చితకబాదిన వ్యభిచారిణులు..!!
Woman attack | ఆశ పడ్డాడు.. అనుభవించాడు.. కానీ చివరకు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మ్యాటర్ తలకిందులైంది.. ఓ ముగ్గురు వ్యభిచారిణుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఓ వ్యక్తి.

Woman attack | హైదరాబాద్ : ఆశ పడ్డాడు.. అనుభవించాడు.. కానీ చివరకు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ముగ్గురు వ్యభిచారిణులు కలిసి విటుడిని చితక్కొట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర( Maharashtra ) పుణె( Pune )లోని బుధ్‌వార్‌పేట్( Budhwar Peth )లో సెప్టెంబర్ 12వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బుధ్‌వార్‌పేట్‌కు చెందిన ఓ 39 ఏండ్ల వ్యక్తి.. లైంగిక కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఓ వ్యభిచారిణి వద్దకు వెళ్లి తన కోరిక తీర్చుకున్నాడు. ఇక నగదు చెల్లించాలని ఆమె కోరడంతో.. ఆన్‌లైన్‌లో చెల్లిస్తానని చెప్పాడు. కానీ ఆన్‌లైన్ యాప్‌లో మనీ చెల్లించేందుకు యత్నించగా పాస్ వర్డ్ మరిచిపోవడంతో.. సమస్య తలెత్తింది. విటుడి వద్ద కనీసం లిక్విడ్ క్యాష్ కూడా లేదు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన వ్యభిచారిణి అతనిపై దాడికి పాల్పడింది.
మరో ఇద్దరు వ్యభిచారిణులను ఘటనాస్థలానికి పిలిపించింది. ముగ్గురు కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. చేసేదేమీ లేక బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యభిచారిణులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.