Aadhar Update | సమయం లేదు మిత్రమా..! ఆధార్‌ అప్‌డేట్‌కు దగ్గరపడుతున్న గడువు..!

Aadhar Update | ఆధార్‌కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచించిన విషయం తెలిసిందే. ఆధార్‌ను ఉచితంగానే అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఉచిత అప్‌డేట్‌ గడువు ఇంతకు ముందు మార్చి నుంచి జూన్‌ 14 వరకు పొడిగించిన విషయం తెలసిందే. my Aadhaar పోర్టల్‌లో ఉచిత అప్‌డేషన్ సర్వీస్ అందుబాటులో ఉన్నది.

Aadhar Update | సమయం లేదు మిత్రమా..! ఆధార్‌ అప్‌డేట్‌కు దగ్గరపడుతున్న గడువు..!

Aadhar Update | ఆధార్‌కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచించిన విషయం తెలిసిందే. ఆధార్‌ను ఉచితంగానే అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఉచిత అప్‌డేట్‌ గడువు ఇంతకు ముందు మార్చి నుంచి జూన్‌ 14 వరకు పొడిగించిన విషయం తెలసిందే. my Aadhaar పోర్టల్‌లో ఉచిత అప్‌డేషన్ సర్వీస్ అందుబాటులో ఉన్నది. ఆధార్‌ తీసుకొని పదేళ్లయిన వారంతా తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ కోరుతున్నది. ఆన్‌లైన్ అప్‌డేట్‌లో మాత్రమే ఉచిత అప్‌డేట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆధార్‌ కేంద్రానికి వెళ్లిన తర్వాత అప్‌డేట్‌ చేసుకునేందుకు చార్జిలు చెల్లించాల్సి ఉంటుంది.

అన్నింటికీ ఆధారమే..

ప్రస్తుత కాలంలో ఆధార్‌ అవసరం బాగా పెరిగింది. బ్యాంకు అకౌంట్‌ తెరవడం, ప్రభుత్వ పథకాలు, సిమ్ కార్డు కొనుగోలు, ఇండ్ల, పాన్‌ కార్డ్‌ ఇలా ఏది కావాలన్నా అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఏవైనా తప్పులు ఉన్నా సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్‌ కేంద్రంతో పాటు స్వయంగా ఆధార్‌నూ ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ తదితర వివరాలు అవసరమవుతాయి. ఆధార్‌లోని డేటాను స్వయంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. ఐరిస్‌, బయోమెట్రిక్‌ కోసం ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోండిలా..

ఆధార్‌ ఉచితంగా ఆన్‌లైన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ అప్‌డేట్ సెలెక్ట్‌ చేసుకోవాలి. అనంతరం ఉదాహారణకు అడ్రస్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటే.. అడ్రస్‌ అప్‌డేట్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్‌డేట్‌ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఆధార్‌కు సంబంధించిన వివరాలను చూసుకోవాలి. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే యాక్సెప్ట్‌ చేయాలి. ఆ తర్వాత అప్‌డేట్‌ చేయడానికి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్‌డేట్‌ ప్రక్రియ కోసం కింద అగ్రీపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత 14 సంఖ్యల రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తుంది. దాని సహాయంతో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను ట్రాక్ చేసుకునేందుకు వీలుంటుంది.