ఉధవ్‌ను సీఎం అభ్యర్థిగా అంగీకరించం : పవార్‌

జూన్‌ 29- మహా వికాస్‌ అఘాది(ఎంవీఏ) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉధవ్‌ థాకరేను అంగీకరించడానికి ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ తిరస్కరించారు.

ఉధవ్‌ను సీఎం అభ్యర్థిగా అంగీకరించం : పవార్‌

ముంబై, జూన్‌ 29- మహా వికాస్‌ అఘాది(ఎంవీఏ) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉధవ్‌ థాకరేను అంగీకరించడానికి ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ తిరస్కరించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎంవీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిన విషయం విదితమే. సమిష్ఠి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ కూడా ఉధవ్‌ థాకరేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించబోమని ప్రకటించింది. ‘మా కూటమే మా ఫేస్‌. సమిష్టి నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటాము’ అని పవార్‌ చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండా ఎన్నికలకు వెళితే నష్టం జరుగుతుందని శివసేన(ఉధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఉధవ్‌ థాకరే ముఖ్యమంత్రిగా చాలా మంచిపనులు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను చూసే ఎంవీఏకు ఎక్కువ ఓట్లు వేశారు’ అని రౌత్‌ అన్నారు. ఎన్‌సీపీ(శరద్‌) అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ మాత్రం ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ప్రకటించవద్దని భాగస్వామ్యపక్షాలను కోరారు.