అద్వానీ..జోషిల, కోవిద్‌లను కలిసిన.. ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కే. అద్వానీ, మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్‌లను కలిశారు. శుక్రవారం ఎన్డీఏ పక్షాల సమావేశంలో మోదీ ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

అద్వానీ..జోషిల, కోవిద్‌లను కలిసిన.. ప్రధాని మోదీ

విధాత : ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కే. అద్వానీ, మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్‌లను కలిశారు. శుక్రవారం ఎన్డీఏ పక్షాల సమావేశంలో మోదీ ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సమావేశం అనంతరం మోదీ ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లారు. ఆయన యోగ క్షేమాలను విచారించి రాజకీయ పరిణామాలను వివరించారు. ఎన్డీఏ పక్ష నేతగా తన ఎన్నిక, ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సమాచారాన్ని అద్వానీకి మోదీ తెలియచేశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రధానిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా అద్వానీని మోదీ ఆహ్వానించారు. అనంతరం మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంటికి వెళ్లిన మోదీ ఆయనతో భేటీ అయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు.