2029ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలు లక్ష్యంగానే బిల్లు: అమిత్ షా

2029 నాటికి మహిళా రిజర్వేషన్లు ఖాయం! లోక్‌సభలో అమిత్ షా కీలక ప్రకటన. 2026లో కుల గణన, జన గణన కలిపి నిర్వహిస్తామని వెల్లడి.

న్యూఢిల్లీ: 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, మహిళా సాధికారికతను సాధ్యం చేయాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం 131రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లుపై చర్చకు ఆయన లోక్ సభలో సమాధానం ఇచ్చారు. సభలో అన్ని పార్టీలు వాదనలు వినిపించాయని, మూడు బిల్లులపై సమగ్ర చర్చ జరిగిందని, సభలో 130 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారు అని గుర్తు చేశారు. బిల్లుపై 56 మంది మహిళ ఎంపీలు మాట్లాడారని తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయని, కానీ… అయితే అంటూనే ఇండియా కూటమి పక్షాలుబిల్లును వ్యతిరేకించాయని అమిత్ షా విమర్శించారు. మూడు బిల్లులకు మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం ఉంది అని స్పష్టం చేశారు. 49 లక్షల ఓటర్లకు ఒక ఎంపీ ఎలా న్యాయం చేస్తారు అని, తెలంగాణలోని మల్కాజిగిరిలో 38 లక్షల ఓటర్లు ఉన్నారని, ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి అని తెలిపారు. కొన్ని చోట్ల 6లక్షల ఓటర్లకు ఎంపీ నియోజకవర్గం ఉందన్నారు. జనాభా లెక్కలకు డిలిమిటేషన్ కు మేం లింకు పెట్టలేదు అని, కాంగ్రెస్ హయాంలోనే ఈ లింకు పెట్టారు అని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభా సమయం వృధా చేయడం అలవాటుగా మారిందన్నారు.

డీలిమిటేషన్ ను వ్యతిరేకించడం అంటే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును వ్యతిరేకించినట్లేనని అమిత్ షా తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగితే సీట్లు కూడా పెరుగుతాయి అని తెలిపారు. 1971నుంచి సీట్ల పెంపుపై ఫ్రీజ్ ఉందన్నారు. ఎమర్జన్సీ కాలంలోనే డీలిమిటేషన్ పెంపుపై నిషేధం పెట్టిందని, ఇప్పుడు కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి కూడా సీట్ల పెంపును అడ్డుకుంటుందని ఆరోపించారు.

అందరి అభిప్రాయంతో 2026లో కులగణనతో పాటు జనగణన చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేకపోయాం అని, 2024లో చేద్దామనుకుంటే కులగణన డిమాండ్ తెరపైకి తెచ్చారు అని పేర్కొన్నారు మేం ఇప్పుడు కులగణన చేస్తుంటే అభినందించేందుకు ప్రతిపక్షాలకు చేతులు రావడం లేదన్నారు. జనగణన, కులగణన కలిపి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని గుర్తు చేశారు. కొత్త జనాభా లెక్కల్లో కులం కాలమ్ చేర్చామని పేర్కొన్నారు. కులగణనను అడ్డుకునేందుకు రాజ్యాంగ సవరణ చేస్తున్నారని ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే జనగణన, కులగణన ప్రారంభమైందన్నారు. ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం ఉత్తర, దక్షిణ భారత దేశం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. మాకు భారత్ దేశం అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యం అని, విభజన రాజకీయాలతో అధికారం దక్కదని వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని ప్రాంతాలకు సమాన అధికారులు, హక్కులు ఉన్నాయని, ప్రాంతీయ బేధాలకు తావు లేదన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో రాష్ట్రాల వారిగా పెరుగబోతున్న సీట్ల సంఖ్యను అమిత్ షా వెల్లడించారు.

కాంగ్రెస్ నేత వేణుగోపాల్ కోరినట్లుగా ఈ బిల్లులో 50శాతం సీట్ల పెంపు అంశాన్ని చేరుస్తామని, ఒక గంటలో బిల్లులో మార్పు తేస్తామని, అఖిలేష్ యాదవ్ మహిళా ప్రధాని ప్రతిపాదన చేయగా..అది కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి ఇబ్బందికరంగా ఉంటుందని సెటైర్లు వేశారు.

ఇవి కూడా చదవండి :

బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !
రాహుల్‌ గాంధీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Latest News