రాహుల్ గాంధీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
ద్వంద్వ పౌరసత్వ ఆరోపణల కేసులో రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరపాలని అక్కడి లఖ్‌నవూ బెంచ్ తెలిపింది.
ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఎస్ విఘ్నేష్ శిశీర్ అనే బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టి హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. లక్నోలోని ప్రజాప్రతినిధుల కోర్టు విఘ్నేష్ పిటిషన్‌ను జనవరి 28న తిరస్కరించడంతో ఆ ఉత్తర్వులను అతడు హైకోర్టులో సవాలు చేశారు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం కూడా ఉందనేది ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
విఘ్నేష్ శిశిర్ పిటిషన్‌ను స్వీకరించిన సమయంలో ఈ అంశం సున్నితమైనదని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో.. కోర్టు ఛాంబర్‌లో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ఇంతకుముందు విచారణ జరిపిన ధర్మాసనం.. రాహుల్ బ్రిటిష్ పౌరసత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో ప్రశ్నించింది. ఆ వివరాలను సైతం పరిశీలించి..పిటిషనర్ సమర్పించిన ఆధారాలను సైతం విచారించి రాహుల్ గాంధీపై కేసు నమోదుకు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
బాయిల్డ్ రైస్ తీసుకోండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల వినతి
ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram