• Telugu News
  • /National

నగదు ఎఫెక్ట్..జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా !

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వర్మ రాష్ట్రపతికి పంపించారు. గతంలో ఢిల్లీలోని వర్మ అధికారిక నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు భారీగా దొరకడం సంచలం రేపిన సంగతి తెలిసిందే.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Apr 10, 2026, 8:40 pm IST
Read Time: 3 mins
నగదు ఎఫెక్ట్..జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా !

విధాత : అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వర్మ రాష్ట్రపతికి పంపించారు. గతంలో ఢిల్లీలోని వర్మ అధికారిక నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు భారీగా దొరకడం సంచలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా నోట్ల కట్టల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అంతర్గత కమిటీని అప్పటీ సుప్రీం చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించారు.

అంతర్గత కమిటీ దర్యాప్తు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను వేలెత్తి చూపగా… ఆయన రాజీనామా చేయాలని అప్పటి సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచించారు. జస్టిస్‌ వర్మ అందుకు తిరస్కరించినట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు నివేదించారు. వర్మను అభిశంసించాలని ఖన్నా రాష్ట్రపతి, ప్రధాని మోదీలకు సిఫారసు చేశారు.

తన నివాసంలో నగదు లభ్యమైందన్న ఆరోపణలతో ఆయన గతంలో ఢిల్లీ హైకోర్టునంచి అలహాబాద్‌కు బదిలీ అయ్యారు. 2025 ఏప్రిల్ 5న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, ప్రస్తుతం ఆ ఆరోపణలకు సంబంధించి అంతర్గత విచారణను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పార్లమెంటు ద్వారా ఆయనను అభిశంసనతో పదవి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ వివాదం ఇలా ఉండగానే ఇంతలో జస్టిస్ వర్మ రాజీనామా చేయడం గమనార్హం.