నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌పై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ) పద్ధతిలో నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పరీక్ష పాత విధానంలోనే…ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని పేర్కొంది. సమయాభావం, ఎన్‌టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఇటీవల నీట్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం.. జూన్ 21న తిరిగి నిర్వహించనుంది. లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌కు మార్చాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్జేడి ఎంపీ సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్ పై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడుతామని పేర్కొంది.