బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !

మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో అభిమాని ఒక్కసారిగా కాళ్లు మొక్కేందుకు దూసుకురావడంతో కంగారుపడిన ఘటన వైరల్ అయింది.

బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !

విధాత : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం దీదీ మమతా బెనర్జీ ప్రచార పర్వంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకపడే మమత ఓ అభిమాని చర్యకు బెదిరిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపు ల ఉన్న ప్రజలకు, అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తూ మమత ముందుకు సాగుతున్నారు. అయితే అనూహ్యంగా ఓ యువకుడు పోలీసు వలయాన్ని దాటుకుని మమత కాళ్లు మొక్కేందుకు ముందుకు దూసుకొచ్చాడు. అనుకోని ఈ ఘటనతో కంగారుపడ్డ మమత కంగారుకు గురై కొద్దిసేపు బిత్తర పోయి అలాగే నిలుచుండి పోయారు.

పోలీసులు వెంటను ఆ యువకుడిని పట్టుకుని తిరిగి పోలీసు వలయం బయటకు తరలించారు. యువకుడి తనపై దాడికి వస్తున్నాడేమో అన్న అనుమానంతో భయపడిపోయిన మమతా బెనర్జీ ఆ తర్వాతా అతడి అభిమానాన్ని అర్ధం చేసుకుని అభివాదం చేసి ప్రచార కార్యక్రమంలో ముందుకు సాగిపోయారు. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ మమత బందోబస్తును మరింత పటిష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

రాహుల్‌ గాంధీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
బాయిల్డ్ రైస్ తీసుకోండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల వినతి