ముంబయిలో రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
ముంబయిలో రూ.1,745 కోట్ల విలువైన 349 కేజీల కొకైన్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌పై భారీ దెబ్బ.
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రపింది. రూ.1,745 కోట్ల విలువైన 349 కేజీల కొకైన్‌ను నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ పట్టివేత విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌లో వెల్లడించారు. అధికారులు చిన్న ఆధారంతో అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే ముఠాలను అణిచివేయడంతో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు అమిత్‌షా తెలిపారు. ముంబయిలో రూ.1,745 కోట్ల విలువైన 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ బృందాన్ని ఆయన అభినందించారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీమ్ డోలాను ఇటీవల తుర్కియే నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
లడ్డాఖ్ లో బుద్ద జయంతిలో పాల్గొన్న అమిత్ షా..
హోమంత్రి అమిత్ షా లడ్డాఖ్ లో తన రెండో పర్యటన కొనసాగించారు. లడ్డాఖ్‌లో నిర్వహించిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాల మొదటి అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొన్నారు. బుద్దుడు జన్మిదినమైన ఈ రోజు అత్యంత పవిత్రమైన దినం అని, సరిగ్గా ఇదే రోజున, క్రీస్తు పూర్వం 563లో లుంబినీ వనంలో యువరాజు సిద్ధార్థుడు జన్మించారని స్మరించుకున్నారు. ఆ తర్వాత జ్ఞానోదయం పొంది ఆయన ‘తథాగత బుద్ధుడు’గా ప్రసిద్ధి చెందారు అని, ఆయన జన్మించిన రోజుతో పాటు, బోధ్ గయలోని బోధి వృక్షం కింద ఆయన పరమ జ్ఞానోదయం పొందిన రోజు కూడా సమానంగా పవిత్రమైనవిగా పరిగణించబడతాయని పేర్కొన్నారు.
దలైలామా ఇక్కడికి వచ్చినప్పుడు..ఈ నేల కేవలం ఒక భౌగోళిక భూభాగం మాత్రమే కాదని ఆయన చెప్పిరని.. ఈ నేల బౌద్ధ సంస్కృతికి, కరుణకు ఒక సజీవ ప్రయోగశాల వంటిదని అమిత్ షా గుర్తు చేశారు. ఈ నేల మీదనే జ్ఞానం భద్రపరచబడింది అని, భారతదేశ నాగరికత వేల సంవత్సరాలుగా శాంతి సందేశాన్ని చాటి చెబుతూ వస్తోందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విమర్శలు..
అమిత్ షా లడ్డాఖ్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఇక్కడి ప్రజలు కోరుతున్న రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ హోదా, అలాగే భూమి, ఉపాధి రక్షణ వంటి డిమాండ్ల విషయంలో మౌనం వహిస్తున్న అమిత్ షా…కేవలం ‘పిప్రహ్వా’ అవశేషాల ఘనతను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించింది.
ఇవి కూడా చదవండి :
భారత్‌లోకి బీవైడీ ‘లెపర్డ్ 8’ హైబ్రిడ్ ఎస్‌యూవీ! ‘డిఫెండర్’కు ప్రత్యర్థి?
నర్మదలో దారుణం: బర్గి డ్యామ్‌లో పడవ మునిగి 9 మంది మృతి | నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram