Maoist Anant surrender| జనవరి 1 వరకు గడువు అడిగి ..లొంగిపోయిన అనంత్

సాయుధ పోరాటాన్ని విరమించి సామూహికంగా తామంతా ఒకేసారి లొంగిపోయేందుకు అవకాశం కల్పించాలని, ఈ మేరకు జనవరి ఒకటవ తేదీ వరకు తమకు గడువు ఇవ్వాలని కోరిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ ప్రకటన విడుదల చేసిన శుక్రవారం రోజే మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయి అందరిని ఆశ్చర్యానికి లోను చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Nov 29, 2025, 11:00 am IST
Read Time: 3 mins
Maoist Anant surrender| జనవరి 1 వరకు గడువు అడిగి ..లొంగిపోయిన అనంత్

చర్చనీయంశంగా ఎంఎంసీ జోన్ ప్రతినిధి తీరు

అనంత్ పై రూ.కోటి రివార్డు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: సాయుధ పోరాటాన్ని విరమించి సామూహికంగా తామంతా ఒకేసారి లొంగిపోయేందుకు అవకాశం కల్పించాలని, ఈ మేరకు జనవరి ఒకటవ తేదీ వరకు తమకు గడువు ఇవ్వాలని కోరిన మావోయిస్టు(Maoist) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ స్పెషల్ జోనల్ (mmc) కమిటీప్రతినిధి అనంత్(Anant) అలియాస్ వికాస్ ప్రకటన విడుదల చేసిన శుక్రవారం రోజే మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయి అందరిని ఆశ్చర్యానికి లోను చేశారు. తాను, తన సహచరులు పదిమంది ఆయుధాలతో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంత్ తీరిప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర లోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదిలావుండగా ఐదు రాష్ట్రాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది.

గత వారం రోజుల క్రితం తొలిసారి అనంత్ ప్రకటన చేస్తూ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల ప్రభుత్వాలు కాల్పుల విరమణ పాటించాలని కోరారు. ఈ మేరకు తాము కూడా కాల్పుల విరమణ పాటిస్తామని పేర్కొన్నారు. తమ లొంగుబాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటే అక్కడే లొంగిపోతామని పేర్కొన్నారు. శుక్రవారం మరో ప్రకటన విడుదల చేస్తూ తామంతా ఒకేసారి లొంగిపోయేందుకు అవకాశం కల్పిస్తూ జనవరి ఒకటవ తేదీని డెడ్లైన్ గా ప్రకటించారు. కానీ ఇవేవి అమలుకాకుండానే ఆయన పోలీసుల ముందు లొంగిపోవడం చర్చనీయాశంగా మారింది. రోజురోజుకు పరిస్థితులు చేయి దాటి పోతున్నందున ఆయన ముందు జాగ్రత్తగా పోలీసుల ముందు లొంగిపోయి ఉంటారని భావిస్తున్నారు.