Bihar | బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది.. మూడు వారాల్లో 13వ ప్రమాదం
బీహార్‌లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. మూడు వారాల్లో వంతెనలు కూలిపోవడం ఇది పదమూడవది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
బీహార్‌లో బుధవారం మరో వంతెన కూలిపోయింది. మూడు వారాల్లో వంతెనలు కూలిపోవడం ఇది పదమూడవది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో వంతెన కూలిపోయింది. అది చిన్న వంతెన లేక కాజ్వే అయి ఉండవచ్చునని, ఘటనకు సంబంధించి మరింత సమాచారం సేకరిస్తున్నామని అదనపు కలెక్టర్ జ్యోతికుమార్ తెలిపారు. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారని కూడా ఆయన తెలిపారు. ‘రాష్ట్రంలో రోజూ వంతెనలు కూలిపోతున్నాయి. పరీక్ష పత్రాలు లీకవుతున్నాయి. శాంతిభద్రతల వైఫల్యం వల్ల జనం చనిపోతున్నారు’ అని ప్రతిపక్ష నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram