Arrest | సల్మాన్‌ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులు అరెస్ట్..!

Arrest | బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాల్పులకు పాల్పడిన అనంతరం ముంబై నుంచి పరారైన నిందితులు గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిని ముంబైకి తీసుకొచ్చి విచారిస్తామన్నారు.

  • Publish Date - April 16, 2024 / 08:44 AM IST

Arrest : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాల్పులకు పాల్పడిన అనంతరం ముంబై నుంచి పరారైన నిందితులు గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిని ముంబైకి తీసుకొచ్చి విచారిస్తామన్నారు.

నిందితులు నవీ ముంబైలోని పన్వెల్‌లోగల హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్‌ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వారిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పూర్వ యజమాని, ద్విచక్ర వాహన విక్రయంలో సహకరించిన ఏజెంట్‌ ఉన్నారు.

వారితోపాటు మరికొందరిని కూడా పోలీసులు విచారించారు. ద్విచక్ర వాహనం పూర్వ యజమానిది కూడా పన్వెల్‌ ప్రాంతమే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 48 గంటల్లోగానే నిందితులను అరెస్ట్‌ చేశారు.

Latest News