Asaduddin Owaisi | బఫూన్ బెదిరింపులు’.. ట్రంప్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.. "బఫూన్ బెదిరింపులు" అంటూ ఘాటు విమర్శలు! భారత్‌పై ఎక్కువ సుంకాలు.. చైనా, పాకిస్థాన్‌కు సడలింపులేమిటని ప్రశ్న!
Asaduddin Owaisi | విధాత: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేష్టలు అత్యున్నత స్థాయిలో ఉన్న బఫూన్ బెదిరింపుల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. భారత ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50 శాతానికి చేరాయని అసదుద్దీన్ విమర్శించారు. రష్యా నుంచి చమురు కొంటున్నామన్న సాకుతో భారత్ పై సుంకాలు విధించిన ట్రంప్.. పాకిస్తాన్, చైనాలపై మాత్రం తక్కువ సుంకాలు వేయడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలతో పాటు అమెరికాను కూడా ఆర్థికంగా గందరగోళ పరిచేదిగా ఉందంటూ అసదుద్ధీన్ విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram