Rahul Gandhi | ఆ రెండు చోట్లా 3.5 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో రాహుల్ జయకేతనం
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ 3.5 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో రాహుల్ జయకేతనం ఎగురవేశారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు.
Rahul Gandhi | న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ 3.5 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో రాహుల్ జయకేతనం ఎగురవేశారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.6 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో 3.8 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
2004 నుంచి రాయ్‌బరేలీలో సోనియాగాంధీ గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో 1.67 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై సోనియా గెలిచారు. ఈ ఎన్నికల్లో వయసు రీత్యా పోటీలో నిలబడలేదు. తనకు బదులుగా రాహుల్‌కు అవకాశం ఇచ్చారు. సోనియా రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. ఈసారి అటు రాయ్‌బరేలీ, ఇటు వయనాడ్ నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ 3.5 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఇక అమేథిలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ.. స్మృతి ఇరానీని చిత్తుగా ఓడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram