Holidays | రేపు భారీ వర్షాలు..! పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం..!!
Holiday | ఈ నెల 16న భారీ వర్షాల( Heavy Rains ) కారణంగా అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షాలు, వరదల( Floods ) నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్( School Education ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Govt Schools ) బుధవారం సెలవులు( Holidays ) ప్రకటించింది.

Holidays | ఈ నెల 16వ తేదీన కర్ణాటక( Karnataka ) రాజధాని బెంగళూరు( Bengaluru )లో భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు( Bengaluru )లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Govt Schools ) కాంగ్రెస్ ప్రభుత్వం సెలవులు( Holidays ) ప్రకటించింది. ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేయాలని సూచించారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి బెంగళూరు వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది.
బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. స్కూల్స్, అంగన్‌వాడీ సెంటర్లకు సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ చదువుతున్న విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా ఉండాలని సూచించారు. ఇక అక్టోబర్ 17న వాల్మికీ జయంతి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.