Bird flu | ఆ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. గుడ్లు, చికెన్‌ విక్రయాలపై నిషేధం..!

Bird flu | బర్డ్‌ ఫ్లూ వైరస్‌..! ఈ వైరస్‌ పక్షులకు సోకుతుంది. ఈ వైరస్‌ సోకిన పక్షి మాంసం తింటే చాలా ప్రమాదం. అందుకే బర్డ్‌ ఫ్లూ సోకిందంటే చాలు పౌల్ట్రీ ఫామ్స్‌లోని కోళ్లను చంపేస్తారు. ఇప్పుడు జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. దాంతో అక్కడ చికెన్, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు కనిపించడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Bird flu | ఆ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. గుడ్లు, చికెన్‌ విక్రయాలపై నిషేధం..!

Bird flu : బర్డ్‌ ఫ్లూ వైరస్‌..! ఈ వైరస్‌ పక్షులకు సోకుతుంది. ఈ వైరస్‌ సోకిన పక్షి మాంసం తింటే చాలా ప్రమాదం. అందుకే బర్డ్‌ ఫ్లూ సోకిందంటే చాలు పౌల్ట్రీ ఫామ్స్‌లోని కోళ్లను చంపేస్తారు. ఇప్పుడు జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. దాంతో అక్కడ చికెన్, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు కనిపించడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

కోళ్లు, బాతులలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని తేలడంతో ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ హోత్వార్‌లో 1,745 కోళ్లు, 450 బాతులు సహా దాదాపు 2,195 పక్షులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హోత్వార్‌లో H5N1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రస్తుతం రాంచీలో కంటైన్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులు, గుడ్లు ఎక్కడ కనిపించినా వాటిని ధ్వంసం చేయాలని ఆదేశించారు.

ఇతర వైరస్‌ల మాదిరిగానే ఈ బర్డ్‌ ఫ్లూ వైరస్ జంతువులు, పక్షులతో పాటు మానవులకు కూడా సోకుతుంది. కాబట్టి రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారమ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన వెంటనే, అక్కడ పనిచేస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లోని ఇద్దరు వైద్యులతో సహా ఆరుగురు ఉద్యోగులను క్వారంటైన్ చేశారు. అంతే కాకుండా పౌల్ట్రీ ఫామ్‌ పరిసర ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

మరోవైపు రాంచీ నుంచి ఇతర నగరాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హోత్వార్ ప్రాంతంలో చికెన్, గుడ్ల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అంతే కాకుండా కోళ్లను ఒక చోట నుంచి మరో చోటికి తీసుకురాకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక జనం చికెన్, గుడ్లు తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు.