తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు

విధాత‌:జార్ఖండ్‌లో జడ్జిని వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించే విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో కొత్త ట్రెండ్‌ కన్పిస్తోంది… తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు. పోలీసులు లేదా సీబీఐకి జడ్జి ఫిర్యాదు చేస్తే.. వారు కనీసం స్పందించడం లేదు. జ్యుడిషియరీకి ఇంటెలిజెన్స్‌ బ్యూరో లేదా సీబీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. "దేశంలో గ్యాంగ్‌స్టర్స్‌తో […]

తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు

విధాత‌:జార్ఖండ్‌లో జడ్జిని వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించే విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో కొత్త ట్రెండ్‌ కన్పిస్తోంది… తమకు వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు. పోలీసులు లేదా సీబీఐకి జడ్జి ఫిర్యాదు చేస్తే.. వారు కనీసం స్పందించడం లేదు. జ్యుడిషియరీకి ఇంటెలిజెన్స్‌ బ్యూరో లేదా సీబీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. “దేశంలో గ్యాంగ్‌స్టర్స్‌తో సంబంధమున్న అనేక కేసులు ఉన్నాయి.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపై కూడా కేసులు ఉన్నాయి… ఇలాంటి సమయంంలో వాట్సస్‌మెసేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు పంపి జడ్జీలను మానసికంగా వేధిస్తున్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసినా… సిబీఐ ఏమీ చేయలేకపోతోంది. సీబీఐ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఇది చాలా బాధాకరమ”ని జస్టిస్‌ రమణ అన్నారు. ఈ కేసు విచారణ సమయంలో సీనియర్‌ లాయర్‌ వీకే బిజు జోక్యం చేసుకుని ఇంటర్‌వెన్షన్‌ పిటీషన్‌ వేసేందుకు అనుమతి కోరారు. కేరళలోని సిట్టింగ్‌ మహిళా జడ్జి, తెలంగాణ జడ్జిపై కూడా ఇలాంటి దాడి జరుగుతోందని అన్నారు. జడ్జీలకు భద్రత కల్పించే విషయమై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను ఇవ్వాలని బెంచ్‌ ఆదేశించింది.