Black Panther | అరుదైన దృశ్యం.. అర్ధరాత్రి వేళ ‘నల్ల చిరుత’ నైట్ వాక్
Black Panther | మీరు ఎప్పుడైనా బ్లాక్ పాంథర్( Black Panther )ను చూశారా..? ఓ రెండు సాధారణ చిరుత పులులతో( Leopards ) కలిసి ఓ నల్ల పులి నీలగిరి( Nilgiris ) అడవుల్లో దర్జాగా నడిచిన దృశ్యాన్ని చూస్తే భలే చూడముచ్చటగా ఉంటుంది కదా.. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..

Black Panther | హైదరాబాద్ : తమిళనాడు( Tamil Nadu )లోని నీలగిరి( Nilgiris ) బయోస్పియర్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ బ్లాక్ పాంథర్( Black Panther ).. అదే నల్ల చిరుత కనిపించింది. అదేదో బ్లాక్ పాంథర్ మాత్రమే కనిపించలేదు. ఆ నల్ల చిరుతతో పాటు మరో రెండు చిరుతలు దర్శనమిచ్చాయి.
ఇక నీలగిరి అడవుల్లోని ఓ రహదారిపై నల్ల చిరుత దర్జాగా నైట్ వాక్( Night Walk ) చేస్తుంటే మరో రెండు చిరుతలు( Leopards ) దానికి బాడీ గార్డుల్లా మాదిరి నడక సాగించాయి. ఈ అరుదైన దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ చిరుతల నడక చూస్తుంటే.. నల్ల చిరుతకు ఏం రాజసం రా అనిపించక తప్పదు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపించే నల్ల చిరుతకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ( Parveen Kaswan ) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బఘీర( Bagheera ) తన స్నేహితులతో కలిసి నీలగిర రోడ్లపై నైట్ వాక్ చేస్తోంది. ఇది చాలా అరుదైంది అని కస్వాన్ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Bagheera (black panther) and other friends for night walk on the roads of Nilgiris. What a rare thing. pic.twitter.com/NtaNSlWUAp
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 18, 2025