Ennore : సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు యువతులు మృతి
తమిళనాడులోని ఎన్నూరు బీచ్ వద్ద సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువతులు అలలతో కొట్టుకుపోయి మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విధాత : సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు యువతులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులోని ఎన్నూరు బీచ్ వద్ద చోటుచేసుకుంది. మృతులు ఎస్. దేవకి సెల్వమ్ (30), భవాని (19), షాలినీ (17), గాయత్రి (18)గా గుర్తించారు. వారి మృతదేహాలు సముద్ర అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దేవకి గుమ్మిడిపూండిలోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో ఉంటుండగా..మిగిలిన వారు చదువుకుంటునే..స్థానిక వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నారు.
వారంతా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ముందుగా మెట్టుకుప్పం బీచ్ లో శాలినీ సముద్రంలోకి దిగగా..ఆమె నీటిలో మునిగిపోతున్న క్రమంలో కాపాడే ప్రయత్నం చేసిన మిగతా ముగ్గరు కూడా సముద్రంలో గల్లంతైనట్లుగా స్థానికుల కథనం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram