Andhra Pradesh : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 1000కోట్ల పరిహారం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు రూ.1000 కోట్ల పరిహారం పంపిణీ చేశారు. అమరావతి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.1000కోట్ల పరిహారం పంపిణీ చేశారు. చంద్రబాబు శనివారం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ, పునరావాస పరిహారం చెక్కుల పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వాసితులకు రెండోసారి పరిహారం పంపిణీన చేసినట్లుగా గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో రూ.828.55 కోట్ల పరిహారం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నేడు మరో రూ.1,000 కోట్ల పరిహారం పంపిణీ చేశామన్నారు.
రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులు, గుత్తేదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చెప్పానని, పనుల్లో వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. రాజధాని పనుల పురోగతి, భూములిచ్చిన రైతులకు స్థలాల రిజిస్ట్రేషన్లు, సుందరీకరణ పనుల వంటి అంశాలపై అధికారులు, గుత్తేదారులతో సమీక్షించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram