UP Teacher Beats Student | అమానుషం.. హోమ్‌వర్క్ చేయలేదని.. విద్యార్థిని బెత్తంతో 150 సార్లు చిత‌కబాదిన టీచ‌ర్‌

ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. హోమ్ వ‌ర్క్‌చేయ‌లేద‌ని (not doing homework) విద్యార్థిని టీచ‌ర్ చిత‌క‌బాదాడు. బెత్తం (Stick)తో చిత‌క‌బాదాడు (UP Teacher beats student). దీంతో ఆ విద్యార్థి ఒంటి నిండా వాత‌లే ప‌డ్డాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 07, 2026, 7:12 pm IST
Read Time: 4 mins
UP Teacher Beats Student | అమానుషం.. హోమ్‌వర్క్ చేయలేదని.. విద్యార్థిని బెత్తంతో 150 సార్లు చిత‌కబాదిన టీచ‌ర్‌

UP Teacher beats student | ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. హోమ్ వ‌ర్క్‌చేయ‌లేద‌ని (not doing homework) విద్యార్థిపై ఓ టీచ‌ర్ త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు. బెత్తం (Stick)తో చిత‌క‌బాదాడు (UP Teacher beats student). దీంతో ఆ విద్యార్థి ఒంటి నిండా వాత‌లే ప‌డ్డాయి. అంత‌టితో ఆగ‌ని టీచ‌ర్‌.. కొట్టిన విష‌యం ఎవ‌రికీ చెప్పొద్ద‌ని బెదిరించాడు.

గోండా జిల్లా కర్నైల్‌గంజ్‌కు చెందిన బాలుడు స్థానిక ప్రైవేట్‌ స్కూల్‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే, స‌ద‌రు విద్యార్థి ఇంగ్లీష్ టీచ‌ర్ ఇచ్చిన హోమ్‌వ‌ర్క్ చేయ‌లేదు. మ‌రుస‌టి రోజు స్కూల్‌కు వెళ్లిన విద్యార్థిపై ఇంగ్లీష్ టీచర్‌ ప్రఖర్ సింగ్ ఆగ్రహం వ్య‌క్తం చేశాడు. హోమ్‌వ‌ర్క్ ఎందుకు చేయ‌లేదంటూ ఫైర్ అయ్యాడు. బెత్తం తీసుకుని దాదాపు 150 సార్లు దారుణంగా చిత‌క‌బాదాడు. దీంతో చిన్నారి ఒంటిపై వాత‌లు తేలాయి. అనంత‌రం కొట్టిన విష‌యం ఎవ‌రికీ చెప్పొద్ద‌ని హెచ్చ‌రించాడు. చెప్తే మ‌ళ్లీ కొడ‌తానంటూ బెదిరించాడు.

టీచ‌ర్ హెచ్చ‌రిక‌ల‌కు భ‌య‌ప‌డిపోయిన విద్యార్థి ఈ విష‌యం గురించి ఎవ‌రికీ చెప్ప‌లేదు. ఆ విద్యార్థి బాధతో కుంటుతూ ఇంటికి చేరుకున్నాడు. అయితే, బాలుడి ఒంటిపై వాత‌లు చూసిన త‌ల్లిదండ్రులు చ‌లించిపోయారు. వెంట‌నే స్కూల్‌కి చేరుకొని ప్రిన్సిప‌ల్‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం పోలీసుల‌కు కూడా కంప్లైంట్ ఇచ్చారు.

టీచ‌ర్ స‌స్పెండ్‌..

ఈ ఘ‌ట‌న‌పై స్కూల్ యాజ‌మాన్యం తీవ్రంగా స్పందించింది. ఈ మేర‌కు స‌ద‌రు ఉపాధ్యాయుడిపై చ‌ర్య‌లు తీసుకుంది. ఇంగ్లీష్ టీచ‌ర్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించింది. మ‌రోవైపు బాధిత తండ్రి ఫిర్యాదు మేర‌కు ఇంగ్లీష్ టీచ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అత‌డిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఈ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఇవి కూడా చదవండి :

Bus Driver | ప్ర‌యాణికుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం.. ఫోన్‌లో రీల్స్ చూస్తూ బ‌స్సు న‌డుపుతున్న ఆర్టీసీ డ్రైవ‌ర్‌.. షాకింగ్ వీడియో
Cheetah | కూనోలో చిరుత కూన‌ల సంద‌డి.. వీడియో చూశారా..?

Tags: