Chhattisgarh 23 Maoists Surrender | చత్తీస్ గఢ్ లో 23 మావోయిస్టులకు లొంగుబాటు

విధాత : ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) వరుస ఎన్ కౌంటర్లు.. లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లా(Sukma district) ఎస్పీ కిరణ్ చవాన్ (SP Kiran Chavan) ఎదుట లొంగిన 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్జీఏ (PLGA) బెటాలియన్‌లో క్రియాశీలకంగా ఉన్న 8 మందితో సహా 23 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు.
వారిలో మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్‌లో ప్రమేయం ఉన్న లోకేష్ కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోలపై రూ.కోటి 18 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని సదుపాయాలు వెంటనే అందిస్తామని ఎస్పీ కిరణ్ చవాన్(Kiran Chavan) వెల్లడించారు.