Cocaine Seized | గుజరాత్‌లో భారీగా కొకైన్‌ సీజ్‌.. దాని విలువ ఎంతో తెలుసా..!

Cocaine Seized | గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్ తీరంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణ సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ కొకైన్‌ విలువ రూ.130 కోట్లు ఉంటుందని చెప్పారు.

  • By: Thyagi |    national |    Published on : Jun 05, 2024 6:19 PM IST
Cocaine Seized | గుజరాత్‌లో భారీగా కొకైన్‌ సీజ్‌.. దాని విలువ ఎంతో తెలుసా..!

Cocaine Seized : గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్ తీరంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణ సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ కొకైన్‌ విలువ రూ.130 కోట్లు ఉంటుందని చెప్పారు. గడిచిన 8 నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటం ఇది రెండోసారని అధికారులు వెల్లడించారు.

కొకైన్ పోలీసులకు పట్టుబడకూడదనే ఉద్దేశంతో స్మగ్లర్లు దాన్ని సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిందని, ఈ ఆపరేషన్‌లో రూ.130 కోట్ల విలువైన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఈ ప్రాంతంలోనే కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని, ఇప్పుడు పట్టుబడ్డ కొకైన్‌ ప్యాకెట్‌లు కూడా వాటి మాదిరిగానే ఉన్నాయని బాగ్మార్‌ తెలిపారు. ఇప్పుడు పట్టుబడిన కొకైన్ ప్యాకెట్లు ఒక్కొక్కటి ఒక కిలో చొప్పున బరువు ఉన్నాయని, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని ఏటీఎస్ పోలీసు సూపరింటెండెంట్ సునీల్ జోషి తెలిపారు.