మొసలి దాడిలో 12ఏళ్ల బాలుడు మరణించిన ఘటన వీడియో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఘాఘరా నది ఒడ్డున చేతులు కడుక్కుంటున్న 12 ఏళ్ల సునీల్‌పై మొసలి దాడి చేసి నీటిలోకి లాగేసింది. స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సుమారు 5 గంటల గాలింపు తర్వాత బాలుడి మృతదేహాన్ని నదిలో గుర్తించారు.
తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో సునీల్ అనాథ బాలుడిగా తన మామయ్య వద్ద ఉంటున్నాడు. బాబాయ్ తో కలిసి పొలం పనుల నుంచి ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో నీటిలోకి దిగినప్పుడు మొసలి దాడి చేసింది. బాలుడిని పలుమార్లు నీటిలో అటుఇటు విసిరికొట్టి నీటిలోపలికి లాక్కెళ్లింది. మొసలి దాడిలో సునీల్ చనిపోగా..అతని మృతదేహాన్ని మొసలి నడుం కింది భాగం వరకు తినేసింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టగా, నది పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మ్యాన్ ఈటర్ గా మారిన మొసలిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!🥺
🔸 ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఘాఘరా నది ఒడ్డున చేతులు కడుక్కుంటున్న 12 ఏళ్ల సునీల్‌పై మొసలి దాడి చేసి నీటిలోకి లాగేసింది.
🔸 స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సుమారు 5 గంటల గాలింపు తర్వాత బాలుడి… pic.twitter.com/tQIB2sJLks
— ముచ్చట్లు (@muchatlu_) July 17, 2026
