CM Revanth Reddy | కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం.. కీలక ఆదేశాలు
హైదరాబాద్ జవహర్ నగర్‌లో వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు

విధాత : హైదరాబాద్ జవహర్ నగర్‌లో వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీధికుక్కల దాడులపై ప్రజల నుంచి ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
విధి కుక్కల దాడులకు కారణాలను విశ్లేషించేందుకు పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కుక్క కాటుకు అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు. కుక్కల నియంత్రణలో ఇతర రాష్ట్రాల పద్ధతులను పరిశీలించాలని చెప్పారు.