World’s Busiest Airports : అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో…న్యూఢిల్లీకి ఏడో స్థానం

ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం 7వ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2025 గణాంకాల ప్రకారం దుబాయ్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు.

World’s Busiest Airports : అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో…న్యూఢిల్లీకి ఏడో స్థానం

విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతున్నది. ప్రపంచ దేశాల్లో డిసెంబర్ 2025 నెలలో అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో దుబాయ్ మొదటి స్థానంలో ఉండగా పదవ స్థానంలో చికాగో ఓహెర్ ఏయిర్ పోర్టు ఉంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు ప్రయాణీకుల రద్దీలో ఏడవ స్థానం సంపాదించింది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీతో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ పర్యాటకులకు ఈ దేశం గమ్యస్థానంగా ఉంది. గత దశాబ్ధకాలంగా ప్రజలు షాపింగ్ కోసం దుబాయ్ లో జరిగే ఫెస్టివల్స్ కు హాజరవుతుంటారు. చవకగా వస్తువులు లభించడం, శాంతి భద్రతల సమస్యల లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ ఏయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) గ్లోబల్ ఏయిర్ ట్రాఫిక్ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం విమనాల్లో ప్రయాణించే ప్రయాణీల సంఖ్య 5 శాతం పెరుగుతోంది. అఫీషియల్ ఏయిర్ లైన్ గైడ్స్ (ఓఏజీ) ప్రకారం డిసెంబర్ నెలలో 5.50 మిలియన్ ప్రయాణీకులు దుబాయ్ ఏయిర్ పోర్టుకు బుకింగ్ చేసుకుని దిగారు. వీరిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు ఉన్నారు. ఆ తరువాతి అనగా రెండో స్థానంలో అమెరికాలోని అట్లాంటా హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషన్ ఏయిర్ పోర్టు ఉంది. ఇక్కడకు 5.21 మిలియన్ల ప్రయాణీకులు వచ్చారు. మూడో స్థానంలో ఉన్న టోక్యో హండెడా ఏయిర్ పోర్టులో 4.68 మిలియన్లు, నాలుగో స్థానంలో చైనాలోని గుంగ్జాహు బైయున్ 4.43 మిలియన్లు, ఐదవ స్థానంలో లండన్ లోని హీత్రూ లో 4.35 మిలియన్లు, ఆరో స్థానంలో చైనాలోని షాంగై పుడోంగ్ 4.32 మిలియన్ల ప్రయాణీకులు వచ్చినట్లు తేలింది. ఏడవ స్థానాన్ని న్యూఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు దక్కించుకున్నది. 4.31 మిలియన్ల మంది ప్రయాణీకులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. పర్యాటకంతో పాటు వ్యాపారం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉన్నత విద్య, హెల్త్ టూరిజం కోసం వచ్చినట్లు వెల్లడి అవుతోంది. ఎనిమిదవ స్థానంలో అమెరికాలోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఏయిర్ పోర్టు లో 4.29 మిలియన్లు, తొమ్మిదో స్థానంలో తుర్కియో లోని ఇస్తాంబుల్ ఏయిర్ పోర్టు 4.22 మిలియన్లు రాగా పదో స్థానంలో అమెరికాలోని చికాగో ఒహరే ఏయిర్ పోర్టు లో 4.12 ప్రయాణీకులు దిగారు.

ఇవి కూడా చదవండి :

Medaram Jatara : అంగరంగ వైభవంగా నూతన గద్దెల ప్రతిష్టాపన
Grape Cultivation | సిరులు కురిపిస్తున్న ద్రాక్ష సాగు.. ఏడాదికి రూ. 75 ల‌క్ష‌లు సంపాదిస్తున్న యువ రైతు