మట్టి, రాళ్లు, కలపతో ఇంటి నిర్మాణం
కుటీరం కోసం మూడేళ్లు శ్రమించిన న్యూఢిల్లీ బ్రదర్స్
ఏయిర్ బీ.ఎన్.బీ లో ఒక రాత్రి అద్దె రూ.13వేలు

మార్నింగ్ మీటింగ్ లో డైలీ టార్గెట్… ఈవినింగ్ మళ్లీ టార్గెట్ కంప్లీట్ అయిందా అంటూ మెస్సేజీ. ఇలాంటి ఒత్తిడి జీవితంలో నిత్యం నరకం అనుభవించే బదులు స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించాలని న్యూఢిల్లీ బ్రదర్స్ నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు ఏమాత్రం ముందూ వెనకా ఆలోచించకుండా కార్పొరేట్ కేరీర్ ను, ఢిల్లీని వదిలేసి తమ సామాన్లను సర్ధుకుని దూరంగా ఉన్న రిషికేష్ కు బయలుదేరారు. హిమాలయన్ మారుమూల ప్రాంతంలో ఒక మట్టి ఇళ్లు (మడ్ హౌస్) ను పురాతన శైలిలో ఆకట్టుకునేలా నిర్మాణం చేశారు. ఈ ఇళ్లు ఏయిర్ బీ.ఎన్.బీ లో ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఒక రోజు ఈ ఇంట్లో గడిపేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్క రాత్రికి రూ.13వేలు ఛార్జీ చేస్తున్నారు. అయినా డిమాండ్ పెరుగుతన్నతే తప్ప తగ్గడం లేదు.

కోవిడ్-19 జీవిత పాఠం నేర్పింది…

అన్ష్ కుమార్ (29), అన్న రాఘవ్ కుమార్ (32) లో ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. రాఘవ్ కు జర్మన్ దేశానికి చెందిన ఆర్కిటెక్టు, డిజైన్ కంపెనీలో చేరిన తరువాత వేతనం, సౌకర్యాలు బాగానే నచ్చాయి. నెలలు గడస్తున్న కొద్దీ ఒత్తిడి పెరగడం, మానసిక ప్రశాంతత కరువు అయ్యింది. కార్పొరేట్ కంపెనీలో చేరిన తరువాత ఆ హోదా, జీతం కాపాడుకునేందుకు నెలలు గడుస్తున్న కొద్దీ పని గంటలు పెరుగుతుంటాయి కాని తగ్గడం లేదు. టార్గెట్ చేరుకోవడానికి 48 గంటలూ పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏసీ ఆఫీసుల్లో కూర్చుని డిజైన్లు తయారు చేయడం, వాటిని ఏలా నిర్మాణం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఫీల్డుకు వెళ్లడం జరుగుతుంటాయి. ఫీల్డులో పనిచేస్తున్న కూలీలను అభినందించే పరిస్థితులు లేకుండా పోయాయి. మూడేళ్లు పని చేసిన సమయంలో సదూర ప్రాంతాలు, కొండ ప్రాంతాలకు వెళ్ళి మళ్లీ వెనక్కి రావడం రివాజుగా మారింది. వీకేండ్స్ లో వాస్తవాన్ని గ్రహించి.. కార్పొరేట్ నిచ్చెన మెట్లు అలా ఎక్కుతూ వెళ్ళడం సరికాదని నిర్ణయించుకున్నాను. తన సోదరుడు అన్ష్ కుమార్ కూడా ఆర్కిటెక్టు గా పనిచేస్తున్నాడు. జర్మన్ కంపెనీలో ఇంటర్న్ షిప్ పూర్తయిన తరువాత పర్యావరణ హిత నిర్మాణ ప్రాజెక్టులలో పనిచేయడం ప్రారంభించాడు. గ్రామీణ ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో నిర్మాణాలకు డిజైన్ పనిచేస్తున్నారు. ప్రకృతి సౌందర్యంపై మక్కువ పెంచుకుని ఆ దిశగా తన డిజైన్లు ఇస్తున్నాడు. జీవితం ఎటూ పోతుందో తెలియని డోలాయమాన పరిస్థితుల్లో తమ గమ్యస్థానాన్ని కోవిడ్-19 మహమ్మారి ఒక (మలుపు) టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇద్దరం న్యూఢిల్లీలో క్వారంటైన్ లో ఉండిపోయాం. ఈ సమయంలో పర్యావరణానికి హాని లేని విధంగా తమ ఇంటి నుండే సహజసిద్ధ నిర్మాణ సామాగ్రితో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. మష్రూమ్స్ (పుట్టగొడుగులు) నుంచి పెంచిన మైసిలియం వినియోగాన్ని పరిశీలించారు. అదే విధంగా మట్టి, గడ్డి, నీటిని ఉపయోగించి ఒక సాంప్రదాయ నిర్మాణ పద్దతి అయిన కాబ్ (కాబ్ కన్ స్ట్రక్షన్)గురించి అధ్యయనం చేశారు. జీవితం చాలా స్పల్పం అని కోవిడ్ మహమ్మరి ప్రపంచానికి తెలియచేసింది అని రాఘవ్ తెలిపారు. దీంతో ఇద్దరం ఒక సాహసోపేతమైన ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాం కూడా. దీన్ని అమలు చేసేందుకు న్యూఢిల్లీకి 150 మైళ్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాం. కొన్ని శతాబ్ధాలుగా హిమాలయ ప్రాంతాలు ఆధ్మాత్మిక, పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. గంగా నదీ పరివాహక ప్రాంతాలు యోగా కేంద్రాలుగా, సేదతీరే ప్రాంతాలుగా పేరొందుతున్నాయి.

కుటీర నిర్మాణంలో 18 దేశాల వలంటీర్ల భాగస్వామ్యం…

న్యూఢిల్లీ ని వదిలేసిన తరువాత 2021 లో రిషికేష్ కు ఇద్దరూ కొద్ది సామాన్లతో చేరుకున్నారు. ఒక కుటుంబం నుంచి లీజు కింద కొంత భూమిని తీసుకున్నారు. మట్టి కుటీరం నిర్మాణం కోసం ఎంపిక చేసుకున్న ప్రాంతానికి చేరుకోవడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. దూరంగా కారు ను పార్కింగ్ చేసి, గంగా నదిపై కర్రలతో నిర్మానం చేసిన బ్రిడ్జీ పై నుంచి వెళ్లాల్సి ఉంటుందని అన్ష్ కుమార్ తెలిపారు. మట్టితో ఇంటిని నిర్మాణం చేసేందుకు మళ్లీ ఏసీ రూముల్లో కూర్చుని, కంప్యూటర్ల సాయంతో ప్లాన్ చేసే బదులు సైటులోనే పాత పద్ధతిలో కర్రలు, రాళ్లతో డిజైన్ సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు సోదరులిద్దరూ. తాము నివాసం ఉంటున్న సమీపంలో మట్టి, రాళ్లు, కలప, సాంప్రదాయంగా దొరికే వస్తువులను పెద్ద ఎత్తున సమీకరించారు. కూలీల సాయం లేకుండా ఇద్దరూ సమీపంలో దొరికే వాటిని రోజూ తీసుకు రావడం, వాటిని పని జరిగే ప్రాంతంలో చేర్చడం చేశారు. అయితే ఇంటి నిర్మాణంలో చాలా మందిని భాగస్వామ్యం చేశారు. తమ ఉద్దేశం, లక్ష్యాలను బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూఢిల్లీ బ్రదర్స్ తెలిపారు. 18 దేశాల నుంచి వంద మంది వలంటీర్లు, 20 మంది కార్మికులతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇంత మంది శ్రమదానం చేసినా, స్వంతంగా ఖర్చు లేకుండా ఇంటి సామాగ్రిని సమకూర్చుకున్నా ఖర్చు మాత్రం తగ్గలేదు. తమ సేవింగ్స్, తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్మును ఇందుకోసం వినియోగించారు. ప్రతి రోజు పురోగతిని చూశామని, రోజుకు సుమారు ఆరు ఇంచుల నుంచి ఒక అడుగు మేర ఎత్తు పెరుగుతూ ఉంటే ఆనందంగా ఉండేదన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో లాపీ ముందు ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు పనిచేయడంతో పోల్చితే ఇది చాలా సంతృప్తినిచ్చింది. అయితే అక్కడ పొద్దంతా పనిచేయడం మూలంగా అలసిపోవడమే కాకుండా ఏ పనీ సాధించలేదనే భావన కూడా తమను వెంటాడుతుండేది. మూడేళ్ల శ్రమ తరువాత 2024 లో అందమైన కుటీరం పూర్తయింది. మట్టి, కలప, రాళ్లతో నిర్మాణం చేసిన అందమైన కుటీరానికి రూ.28.72 లక్షలు ఖర్చయినట్లు సోదరులు వెల్లడించారు. అందరికీ అందుబాటులోకి ఈ ఇంటిని తీసుకువచ్చేందుకు ఏయిర్ బీ.ఎన్.బీ లో 2024, ఏప్రిల్ లో వివరాలు నమోదు చేశాం. తమ ఇళ్లు లేదా విల్లాను అద్దెకు ఇచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా యజమానులు ఏయిర్ బీ.ఎన్.బీ వెబ్ ఫోర్టల్ ను వేదికగా చేసుకుంటున్నారు. ఒక రాత్రి నివాసం ఉండేందుకు రూ.13,405 (140 డాలర్లు) గా అద్దె మొత్తాన్ని ఖరారు చేశారు. ఈ ఇంటికి చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరం లో కారు ను పార్క్ చేసి, తమ సామాన్లను ఎవరికి వారు తీసుకుని నడక దారిలో రావాల్సి ఉంటుందని షరతు విధించారు. ఇంటర్ నెట్ సౌకర్యం ఉండదని, మీ ప్రియమైన కుటుంబ సభ్యుల కనెక్షన్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని ప్రాంతాలలో ఇలాంటి మట్టి కుటీరాలు…

సహజసిద్ధమైన మట్టి కుటీరం విజయవంతం కావడంతో దేశంలోని మిగతా ప్రాంతాల్లో నిర్మాణం చేసేందుకు న్యూఢిల్లీ బ్రదర్స్ సిద్ధమయ్యారు. రిషికేష్ లోనే డిజైన్ స్టూడియోను ఏర్పాటు చేశారు. అడవులు, చెట్టు చేలు, జంతువుల సంచారం, ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోవడం, గమ్యస్థానానికి చేరుకోవడానికి నడక దారి వంటి సమస్యలను పరిగణనలోకి తీసుకుని సురక్షితంగా ఉండే ప్రాంతాలలో మట్టి ఇళ్ల ను నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన తరువాత వాహన సౌకర్యం లేకుండా నడవడం మూలంగా ఫిట్ గా తయారు అయ్యామని, మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించిందని సోదరులు పేర్కొన్నారు. ప్రతి రోజు పదివేల అడుగులు వేసినా అంత దూరం నడిచామా అనేది గుర్తు కు రాదని, అలసట ఆవిరి అయిపోతుందని, దీనికంతటికీ కారణం ప్ర‌కృతి సౌందర్యమేనని రాఘవ్, అన్ష్ లు పేర్కొన్నారు.