పెళ్లైన ఆరేండ్లకు సంతానం.. కానీ అగ్నికీలలకు పసిబిడ్డ బలి
ఆ దంపతులకు ఆరేండ్ల క్రితం వివాహమైంది. కానీ వెంటనే సంతానం కలగలేదు. ఎన్నో చికిత్సల అనంతరం పెళ్లైన ఆరేండ్లకు సంతానం కలిగింది. దీంతో దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. పసిబిడ్డను చూసి మురిసిపోయారు. కానీ ఆ బిడ్డను అగ్నికీలలకు ఆహుతైంది.

న్యూఢిల్లీ : ఆ దంపతులకు ఆరేండ్ల క్రితం వివాహమైంది. కానీ వెంటనే సంతానం కలగలేదు. ఎన్నో చికిత్సల అనంతరం పెళ్లైన ఆరేండ్లకు సంతానం కలిగింది. దీంతో దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. పసిబిడ్డను చూసి మురిసిపోయారు. కానీ ఆ బిడ్డను అగ్నికీలలకు ఆహుతైంది.
దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. బేబి కేర్ హాస్పిటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు పసి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడుగురిలో ఒకరే ఆ పసిపాప.
ఈస్ట్ ఢిల్లీకి చెందిన వినోద్, జ్యోతికి ఆరేండ్ల క్రితం పెళ్లైంది. కానీ చాలా కాలం వరకు వారికి సంతానం కలగలేదు. ఇటీవలే జ్యోతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో గత శనివారం బేబి కేర్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వైద్యులు చికిత్స కూడా ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆ బిడ్డ చనిపోయింది. దీంతో వినోద్, జ్యోతి గుండెలవిసేలా రోదించారు.