భారీ వర్షాలున్నా.. దేశవ్యాప్తంగా గతేడాదికంటే తక్కువ నిల్వలతో రిజర్వాయర్లు

రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. దేశవ్యాప్తంగా విస్తరించాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. అయినా.. దేశంలోని రిజర్వాయర్లలో మాత్రం ఆశించినంత స్థాయిలో నీటి నిల్వలు (average water level in reservoirs) లేవు. గత ఏడాదికంటే తక్కువ స్థాయిలో నీటి మట్టాలు ఉన్నట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.

భారీ వర్షాలున్నా.. దేశవ్యాప్తంగా గతేడాదికంటే తక్కువ నిల్వలతో రిజర్వాయర్లు

న్యూఢిల్లీ: రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. దేశవ్యాప్తంగా విస్తరించాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. అయినా.. దేశంలోని రిజర్వాయర్లలో మాత్రం ఆశించినంత స్థాయిలో నీటి నిల్వలు (average water level in reservoirs) లేవు. గత ఏడాదికంటే తక్కువ స్థాయిలో నీటి మట్టాలు ఉన్నట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం (Central Water Commission) పేర్కొన్నది. కొన్నింటిలో సానుకూల పరిస్థితులు ఉంటే.. మరికొన్నింటిలో ప్రతికూలంగా ఉన్నాయని తెలిపింది. దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో సగటు నీటి మట్టాలు గత ఏడాదికంటే తక్కువ ఉన్నట్టు తెలిపింది. అంతేకాకుండా.. ఇవి గత దశబ్దంక్రితం మట్టాల స్థాయిలో ఉన్నట్టు పేర్కొన్నది. 150 ప్రధాన రిజర్వాయర్లలో మొత్తం లైవ్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 178.784 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (BCM). అందులో ప్రస్తుతం 69.35 per cent అంటే 257.812 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు మాత్రమే ఉన్నట్టు కేంద్ర జల సంఘం తెలిపింది. ఈ రిజర్వాయర్లలో మొత్తం లైవ్‌ స్టోరేజ్‌ (live storage) సామర్థ్యంలో 51శాతం లేదా 91.496 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు అందుబాటులో ఉన్నట్టు జల సంఘం నివేదిక పేర్కొంటున్నది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన స్టోరేజ్‌లో ఇది 94శాతం. గత దశాబ్దపు సగటు (decade’s average) గమనిస్తే 107 శాతమని నివేదిక తెలిపింది.

జూలై 25 నాటి బులెటిన్‌ ప్రకారం.. గత వారంతో పోల్చితే.. ఈ రిజర్వాయర్లలో 69.27 బీసీఎం.. అంటే మొత్తం సామర్థ్యంలో 39శాతం ఉన్నట్టు జల సంఘం నివేదిక పేర్కొన్నది. గత ఏడాది ఇదే కాలంలో లైవ్‌ స్టోరేజ్‌ 83.987 బీసీఎంగా ఉన్నది. సగటు స్టోరేజ్‌ 72.411 బీసీఎం. గతవారంకంటే ఈ వారం స్టోరేజ్‌ స్థాయి పెరిగినట్టు కనిపిస్తున్నా.. గత ఏడాది ఇదే సమయంతో (corresponding period) పోల్చితే తక్కువేనని జల సంఘం నివేదిక తెలిపింది.
హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ సహా ఉత్తర ప్రాంతంలో పది ముఖ్యమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి మొత్తం సామర్థ్యం 19.663 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. ప్రస్తుతం వాటిలో 6.532 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి మట్టం ఉన్నది. అంటే వాటి పూర్తి సామర్థ్యంలో 33 శాతమే. ఇది గత ఏడాది స్టోరేజీ 76 శాతం, సాధారణ స్టోరేజీ 53 శాతంతో పోల్చితే గణనీయంగా తగ్గుదల కనిపిస్తున్నది. గతవారం 5.786 బీసీఎంతో పోల్చితే ప్రస్తుత స్థాయి పెరిగిందని తెలిపింది.

అసోం, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, నాగాలాండ్‌, బీహార్‌లు ఉన్న తూర్పు ప్రాంతంలోని (The eastern region) 23 రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం 20.430 క్యూబిక్‌ మీటర్లు. ప్రస్తుతం వాటిలో 6.989 బీసీఎం లేదా వాటి సామర్థ్యంలో 34 శాతం మాత్రమే నిల్వలు ఉన్నాయి. అయితే.. గత ఏడాది ఇదే కాలం (31%)తో పోల్చితే పెరుగుదల కనిపిస్తున్నా.. సాధారణ స్టోరేజ్‌ 39 శాతం కన్నా తక్కువే. పశ్చిమ ప్రాంతంలోని గుజరాత్‌, మహారాష్ట్రలో 49 రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం 37.130 క్యూబిక్‌ మీటర్లు. ప్రస్తుతం వీటిలో 19.863 బీసీఎం స్టోరేజ్‌ ఉన్నది. అంటే వాటి పూర్తి సామర్థ్యంలో 53 శాతం. ఇది గతేడాది 63 శాతం ఉన్నది. అయితే.. సాధారణ స్టోరేజీ 48 శాతంతో పోల్చితే మెరుగ్గానే ఉన్నది.
ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో కూడిన మధ్య ప్రాంతం (The central region)లోని 26 రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 48.227 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు లేదా 48 శాతం. వీటిలో గత ఏడాది 55 శాతం ఉన్నది. వీటి సగటు సామర్థ్యం 50శాతం కంటే మెరుగైన పరిస్థితి కనిపిస్తున్నది. ముందు వారంతో పోల్చితే ఈ వారం కొంత పెరిగిందని జల సంఘం నివేదిక తెలిపింది.

ఇక దక్షిణాదికి వస్తే.. (The southern region) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 42 రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం 53.334 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. సగటు 47శాతం. అయితే.. వాటిలో ప్రస్తుతం 35.010 బీసీఎం లేదా 66 శాతం ఉన్నది. ఇది గత ఏడాది 50శాతం మాత్రమే ఉన్నది. గత వారంతో పోల్చితే ఈ వారం స్టోరేజీ పెరిగింది. గత ఏడాది స్టోరేజ్‌ స్థాయితో పోల్చితే కొన్ని రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితులు (improved storage levels) ఉన్నాయి. వాటిలో అసోం, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, నాగాలాండ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటివి ఉన్నాయి. వాటితో పోల్చితే రాజస్థాన్‌, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తక్కువ స్టోరేజ్‌ లెవెల్స్‌ రికార్డయ్యాయని కేంద్ర జల సంఘం తెలిపింది.