తిరుమలకు 481 సార్లు కాలినడకన వెళ్లిన భక్తుడు..వైరల్

తిరుమల మెట్ల మార్గం గుండా శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళ్లేందుకు అందరికి శక్తి, ఓపిక,ఆరోగ్యం ఉండకపోవచ్చు. అయితే ఏపీకి చెందిన శ్రీకాకుళంకు చెందిన ఓ భక్తుడు ఏకంగా ఇప్పటివరకు 481 సార్లు కాలినడకన కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం వైరల్ గా మారింది.

తిరుమలకు 481 సార్లు కాలినడకన వెళ్లిన భక్తుడు..వైరల్

విధాత : తిరుమల మెట్ల మార్గం గుండా శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళ్లేందుకు అందరికి శక్తి, ఓపిక,ఆరోగ్యం ఉండకపోవచ్చు. అయితే స్వామివారిని కాలినడకన దర్శించుకునేందుకు చాల మంది భక్తులు తపిస్తూ..కష్టమైనప్పటికి కాలినడకన తిరుమలకు చేరుకుంటుంటారు. స్వామివారి దర్శనంతో తమ పడిన శ్రమను అంతా మరిచిపోయి గోవింద నామస్మరణతో తన్మయత్వం పొందుతుంటారు.  అయితే ఏపీకి చెందిన శ్రీకాకుళంకు చెందిన ఓ భక్తుడు ఏకంగా ఇప్పటివరకు 481 సార్లు కాలినడకన కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం వైరల్ గా మారింది.

శ్రీకాకుళంకు చెందిన 59ఏళ్ల మహంతి శ్రీనివాసరావు ప్రతినెల అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని మూడు నాలుగైదు రోజు గడుపుతూ స్వామివారిని నాలుగైదు సార్లు దర్శించుకుంటున్నారు. శ్రీవారి అనుగ్రహంతో తాను 481సార్లు కాలినడకన కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని, తన ప్రయాణంలో దాదాపు 12వేల మంది భక్తులను ఇప్పటిదాక తాను మెట్ల మార్గంలో కొండపైకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తిరుమల యాత్ర విహార యాత్ర కాదని, పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర అని, ప్రతి భక్తుడు తన జీవిత కాలంలో ఒక్కసారైన మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు.

 

Latest News