క‌ర్ణాట‌క సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్ ఆయనతో ప్రమాణం చేయించారు

విధాత : కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగం మినీబుక్‌ను చేతబట్టి డీకే ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన సీనియర్ అయిన సిద్ధరామయ్యను వేదికపైనే డీకే సత్కరించారు.

డిప్యూటీ సీఎంగా జి. పరమేశ్వర, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కేహెచ్‌ మునియప్ప, కె.జె.జార్జ్‌, ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డి, సతీశ్‌ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యు.టి.ఖాదిర్‌, ఈశ్వర్‌ ఖండ్రే, బైరతి సురేశ్‌, శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌కు మంత్రి పదవులు దక్కాయి.

డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, కేరళం సీఎం సతీశన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర ఏఐసీసీ నేతలు హాజరయ్యారు.

Latest News