Doctor Beats Patient | రోగిని చితకబాదిన డాక్టర్..వైరల్ వీడియో

వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగిపై డాక్టర్ విక్షణారహితంగా దాడిచేసి చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Doctor Beats Patient | రోగిని చితకబాదిన డాక్టర్..వైరల్ వీడియో

విధాత, హైదరాబాద్ : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగిపై డాక్టర్ విక్షణారహితంగా దాడిచేసి (doctor beats patient)చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి(Shimla IGMC hospital)లో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

షిమ్లాలోని ప్రసిద్ధ ఆస్పైర్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న కుప్వి (షిమ్లా)కి చెందిన అర్జున్ పవార్ అనే ఉపాధ్యాయుడు బ్రీతింగ్ సమస్యతో ఎండోస్కోపీ కోసం ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్ష తర్వాత అతన్ని ఒక మంచంపై విశ్రాంతి తీసుకోమని ఓ వైద్యుడు సూచించాడు. కాని మరో డాక్టర్ వద్దన్నాడు. ఈ సందర్బంగా వాగ్వాదం తీవ్రమైంది. తనను అవమానించేలా డాక్టర్ కామెంట్స్ చేయడంతో గౌరవంగా మాట్లాడాలని కోరగా దాడికి దిగారని బాధితుడు(Doctor attacks patient) ఆరోపించారు.

వైద్యుడి చర్యను నిరసిస్తూ బాధితుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య మంత్రి ధనిరామ్ షాండిల్ విచారణకు ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ, కాలేజీ ప్రిన్సిపాల్ ను పిలిచి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.