Scissors | ఆమె పొత్తి కడుపులో కత్తెర.. 12 ఏండ్ల పాటు నరకయాతన
Scissors | డాక్టర్ల( Doctors ) నిర్లక్ష్యం ఓ మహిళ( Woman ) పాలిట శాపంగా మారింది. 12 ఏండ్ల క్రితం సర్జరీ( Surgery ) జరగ్గా.. ఆమె కడుపు( Stomach ) లోనే కత్తెర( Scissors )ను ఉంచి కుట్లు వేశారు. తీవ్రమైన కడుపునొప్పితో 12 ఏండ్ల నరకయాతన అనుభవించింది ఆవిడ.

Scissors | సిక్కిం( Sikkim ) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ( Woman ).. గత కొన్నేండ్ల నుంచి తీవ్రమైన కడుపు( Stomach ) నొప్పితో బాధపడుతోంది. దాంతో తిరగని ఆస్పత్రి లేదు ఆమె. ఎవరూ కూడా ఆమెకు సరైన వైద్యం అందించలేదు. కడుపు నొప్పికి మెడిసిన్( Medicine ) రాసిచ్చేవారు. ఆ పూటకు ఉపశమనం పొందేది ఆమె.
కడుపు నొప్పి మరింత తీవ్రం కావడంతో చేసేదేమీ లేక ఈ ఏడాది అక్టోబర్ 8న సర్ తుటుబ్ నమ్‌గ్యల్ మెమోరియల్ ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ బాధిత మహిళకు స్కానింగ్ నిర్వహించగా, పొత్తి కడుపులో కత్తెర( Scissors ) ఉన్నట్లు వైద్యులు( Doctors ) నిర్ధారించారు. దీంతో ఆవిడకు సర్జరీ( Surgery ) నిర్వహించి కత్తెరను తొలగించారు.
12 ఏండ్ల క్రితం.. అపెండిక్స్
అయితే ఆమెకు 12 ఏండ్ల క్రితం అపెండిక్స్( Appendix ) నొప్పి వచ్చింది. దీంతో సర్ తుటుబ్ నమ్‌గ్యల్ మెమోరియల్ ఆస్పత్రి వెళ్లగా, వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆమె పొత్తి కడుపులోనే కత్తెర మరిచి కుట్లు వేశారు. ఇక అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె కడుపు నొప్పితో బాధపడుతూనే ఉంది. చివరకు ఆ కత్తెరను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.