Lok Sabha Elections | బెంగాల్‌లో ఘర్షణ.. తృణమూల్‌ బూత్‌ ఏజెంట్‌పై బీజేపీ అభ్యర్థి దాడి.. Video

Lok Sabha Elections | లోక్‌సభ మూడో విడత ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ముర్సీదాబాద్‌ నియోజకవర్గంలోని జాంగిపూర్‌ పోలింగ్ కేంద్రం దగ్గర తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ బూత్‌ అధ్యక్షుడిపై బీజేపీ అభ్యర్థి ధనంజయ్‌ ఘోష్‌ దాడికి పాల్పడ్డారు. బీజేపీ అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోకి రావడంతో తృణమూల్‌ బూత్ అధ్యక్షుడు వీడియో తీశాడు.

Lok Sabha Elections | బెంగాల్‌లో ఘర్షణ.. తృణమూల్‌ బూత్‌ ఏజెంట్‌పై బీజేపీ అభ్యర్థి దాడి.. Video

Lok Sabha Elections : లోక్‌సభ మూడో విడత ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ముర్సీదాబాద్‌ నియోజకవర్గంలోని జాంగిపూర్‌ పోలింగ్ కేంద్రం దగ్గర తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ బూత్‌ అధ్యక్షుడిపై బీజేపీ అభ్యర్థి ధనంజయ్‌ ఘోష్‌ దాడికి పాల్పడ్డారు. బీజేపీ అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోకి రావడంతో తృణమూల్‌ బూత్ అధ్యక్షుడు వీడియో తీశాడు.

దాంతో వీడియో ఎందుకు తీస్తున్నావంటూ బీజేపీ అభ్యర్థి ధనంజయ్‌ ఘోష్‌ టీఎంసీ బూత్‌ ఏజెంట్‌తో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇంతలో పోలీసులు కలుగజేసుకుని మాట్లాడుతుండగానే ధనంజయ్‌ ఘోష్‌ టీఎంసీ బూత్‌ ప్రెసిడెంట్‌పై చేయిచేసుకున్నాడు. అతను కూడా బీజేపీ అభ్యర్థిపై తిరగబడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని ఇద్దరిని విడిపించారు.

ఈ ఘటనను అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు రికార్డు చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఘటనపై బీజేపీ అభ్యర్థి ధనంజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల దగ్గర అభ్యర్థినే ఈ విధంగా భయపెడితే సామాన్యుల పరిస్థితి ఏందని ప్రశ్నించారు. ఘటనపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని చెప్పారు.