Viral Video | పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఓ వృద్ధుడు చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ పెద్ద మనిషి.. తన పక్కింటోళ్ల పర్సనల్ వీడియోను తీసేందుకు ప్రాణాలు కూడా ఫణంగా పెట్టాడు. ఎత్తయి భవనంలోని బాల్కనీలోని సన్నటి అంచుపై కూర్చొని.. పక్క ఫ్లాట్ బాల్కనీవైపు ప్రమాదకరంగా వంగి మరి వీడియోలు చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో తమ కెమెరాతో జూమ్ చేసి ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అప్పుడు ఓ వృద్ధుడు పక్కింటిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. బాల్కనీలోకి వచ్చిన ఓ వృద్ధుడు సన్నటి అంచుపై కూర్చుండి పక్క ఫ్లాట్‌వైపునకు పూర్తిగా వంగి.. ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు.
అంతేకాదు తన శరీరాన్ని ముందుకు వంచి పక్కనే ఉన్న బాల్కనీ వైపు చూస్తూ.. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకున్నట్లుగా ఆ వీడియోలో కనిపించింది. అది చూసిన పలువురు పక్కింటోళ్ల పర్సనల్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. ప్రమాదకరంగా బాల్కనీలో నుంచి వంగి వీడియోలు తీయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
इन चाचा को देखिए 😳
अपनी जान की परवाह किए बिना, पड़ोसी घर में हो रही लड़ाई का वीडियो बनाने के लिए खिड़की से लटक गए,
असल में बगल वाले घर में झगड़ा चल रहा था, लेकिन आवाज साफ सुनाई नहीं दे रही थी,
जिज्ञासा में चाचा साहब सीधे बिल्डिंग की खिड़की से झूलकर वीडियो रिकॉर्ड करने लग गए। pic.twitter.com/x33cdGG3uN
— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) May 29, 2026
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంత ఎత్తులో ఇలా కూర్చోవడం ప్రాణాపాయం అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలు ఆందోళనకరమని అభిప్రాయపడుతున్నారు. సదరు వీడియో తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.