అటవీ ప్రాంతాల్లో జంతువులు సాధారణంగా శాంతంగానే కనిపిస్తుంటాయి. అయితే వాటి ఆవాసంలోకి మానవులు సహా ఇతర జంతువులు చొరబడినప్పుడే అవి ఆగ్రహంతో రెచ్చిపోతుంటాయి. తన అటవీ ఆవాసం పరిధిలోకి వచ్చిన మనుషులను ఓ ఏనుగు తరిమేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక అటవీ ప్రాంతం సమీపంలోని నదిలో దిగి నడుస్తున్న పిల్లలతో సహా కొంతమందిపై ఆకస్మికంగా ఒక ఏనుగు దాడికి దిగింది. వారిని వెంటాడి మరి భయపెట్టింది. ఏనుగు మీదకు దూసుకురావడంతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీసి..ఒడ్డున ఉన్న వాహనాల వైపు పారిపోయారు. ఏనుగు తమవైపు రాకుండా గట్టిగా కేకలు వేయడం, వాహనాల హారన్స్ మోగించడంతో అది పక్కకు వెళ్లిపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పుట్టలో వేలు పెడితే నే కుట్టనా అన్న చీమ కథను గుర్తు చేస్తున్నారు. ఏనుగులు వంటి వన్యప్రాణుల ఆవాసాలైన అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి వాటి ప్రశాంత జీవనానికి ఇబ్బంది కల్గిస్తే..పరిణామాలు ఇలాగే ఉంటాయని కామెంట్లు పెట్టారు. వన్యప్రాణుల సరిహద్దులను గౌరవించాలన్న సందేశం ఈ ఘటన చాటుతుందని గుర్తు చేశారు. ఈ వీడియో క్లిప్ నెట్టింటా 2 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకపోవడం విశేషం.
Los animales suelen ser pacíficos, hasta que tienes la osadía de invadir su territorio…
Cuando el arte de la naturaleza se sale de control… 😱😱😱 pic.twitter.com/VfYJZ4lh3F
— El Club del Arte 🎨📷📚🖼🕍🎼 (@Arteymas_) June 7, 2026
