Vocono Eruption | ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం.. భారత్‌పై ప్రభావం

ఇథియోపియాలోని ప్రముఖ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. 10వేల సంవత్సరాల తరువాత తొలిసారిగా హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం పేలింది. దీంతో భారీగా ఎగిసిపడిన బూడిదమేఘాలతో భారత్ పై ప్రభావం చూపనుంది.

  • By: chinna |    national |    Published on : Nov 24, 2025 8:42 PM IST
Vocono Eruption | ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం.. భారత్‌పై ప్రభావం

ఇథియోపియాలోని ప్రముఖ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. 10వేల సంవత్సరాల తరువాత తొలిసారిగా హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం పేలింది. దీంతో భారీగా ఎగిసిపడిన బూడిదమేఘాలతో భారత్ పై ప్రభావం చూపనుంది. దీంతో సోమవారం రాత్రి నాటికి గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ(ఎన్సీఆర్), పంజాబ్ రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఈ బూడిద మేఘాలు 10 నుంచి 15 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తున్నాయి. ఈ పొగ ప్రభావంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కాగా, అగ్నిపర్వత విస్ఫోటనంతో బూడిద మేఘాలు రెడ్ సీ దాటి మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా వైపు కదలడం ప్రారంభించడంతోనే ఎయిర్‌లైన్స్ ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇండిగో ఇప్పటికే 6 విమానాలను రద్దు చేసింది. వీటిలో ఒకటి ముంబై నుండి, మిగతావి సౌత్ రాష్ట్రాల నుంచి బయల్దేరాల్సినవి ఉన్నాయి. ముంబై విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ఆధారంగా.. విమానాలను పాకిస్థాన్ గగనతలం వైపు మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ గగనతలం భారతీయ ఎయిర్‌లైన్స్ కోసం మూసివేయబడింది. అందువల్ల భారతీయ విమానాలు మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో అవసరమైతే మరిన్ని విమానాలు రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.