Tej Pratap Yadav | స్వతంత్ర అభ్యర్థిగా తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ..!
Tej Pratap Yadav | ఆర్జేడీ( RJD ) బహిష్కృత నేత, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్( Tej Pratap Yadav )అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Assembly Elections ) ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు.

Tej Pratap Yadav | పాట్నా : ఆర్జేడీ( RJD ) బహిష్కృత నేత, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్( Tej Pratap Yadav )అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Assembly Elections ) ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. వైశాలి జిల్లాలోని మహువా( Mahua ) స్థానం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఇటీవలే తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్( Lalu Prasad Yadav ) పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లాలోని హసన్‌పూర్( Hasanpur ) నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం సాయంత్రం తేజ్ ప్రతాప్ యాదవ్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన ప్రత్యర్థులు ఆందోళనలో ఉన్నట్లుంది. తనకు ప్రజల మద్ధతు సంపూర్ణంగా ఉందన్నారు. ఇప్పటికే తన సోషల్ మీడియా టీమ్ ప్రజలను చేరుకుందన్నారు.
ఇక ప్రస్తుత సీఎం నితీష్ కుమార్( CM Nitish Kumar ).. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పదవిని కోల్పోయే అవకాశం ఉందన్నారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యంపై దృష్టి సారించే వారి పక్షాన తాను నిలబడుతానని అలాంటి వారికే తన మద్దతు ఉంటుందన్నారు.
ఆర్జేడీ నుంచి ఆరేండ్ల పాటు తేజ్ ప్రతాప్‌ను బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ మే 25న ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాతో అనుష్క( Anushka ) మహిళతో సంబంధం ఉందని తాను ఒప్పుకున్న తర్వాతనే తన తండ్రి పార్టీ నుంచి బహిష్కరించారని తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. అయితే తన ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయిందని చెబుతూ ఆ పేజీని తొలగించారు తేజ్ ప్రతాప్ యాదవ్.