Congress Party | సెంచరీ కొట్టిన కాంగ్రెస్.. 52 నుంచి 100కు చేరిన కాంగ్రెస్ సీట్లు
Congress Party | 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విశేషమైన ప్రజాదరణ లభించింది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీనిచ్చింది. 2019 ఎన్నికల్లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ సంఖ్యను 100కు చేర్చింది.

Congress Party | న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విశేషమైన ప్రజాదరణ లభించింది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీనిచ్చింది. 2019 ఎన్నికల్లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ సంఖ్యను 100కు చేర్చింది.
అయితే మిత్రపక్షాల సహాయంతో 400 సీట్లలో గెలుస్తామన్న బీజేపీ వాదనను కాంగ్రెస్ పార్టీ తునతునాకలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కాన్ఫిడెన్స్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దేశానికి బీజేపీనే ఒక శక్తి అని భావించిన ఆ పార్టీ నేతలకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. గట్టి పోటీనిచ్చి, వారి విశ్వాసాలపై దెబ్బకొట్టింది.
ఇండియా కూటమి 233 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అంటే ఇండియా, ఎన్డీఏ కూటమి మధ్య తీవ్రమైన పోటీ ఉందని అర్థమవుతోంది. నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతోంది. ఈ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ నైతిక ఓటమి చెందారని పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బూటకమని తేలిపోయిందని జైరాం రమేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాదనను కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టింది. మోదీ వాదనలకు విరుద్ధంగా బీజేపీకి 250 కంటే తక్కువ సీట్లు, ఎన్డీఏకు 290 సీట్లకు పరిమితం చేయడంలో కాంగ్రెస్ సఫలీకృతమైంది. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సాధించిన విజయంగా చెప్పొచ్చు.
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి బీజేపీని చిత్తుగా ఓడించి, అధికారం చేజిక్కించుకుంది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో మాత్రం మోదీకి గట్టి పోటీనిచ్చి తన శక్తిని చాటుకుంది.