Dog Protects Tigers | పులులకు రక్షణగా ‘కుక్క’..! వేటగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘జెనీ’..!!
Dog Protects Tigers | పెద్ద పులి( Tiger ) అంటేనే అటు జంతువులు( Animals ), ఇటు జనాలు గజగజ వణికిపోతారు. దాని ఛాయ కనిపించిందంటే చాలు ఆ దరిదాపుల్లో జంతువులు కానీ, మనషులు కానీ ఉండరు. అలాంటి భయంకరమైన పెద్ద పులులకు, చిరుతలకు( Leopards ) ఓ శునకం( Dog ) కాపలా కాస్తుంది. ఇది వినడానికి మీకు ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు. కానీ వెయ్యి శాతం ఇది నిజం. మరి ఆ శునకం గురించి తెలుసుకోవాలంటే బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్( Bandhavgarh Tiger Reserve )కు వెళ్లాల్సిందే.

Dog Protects Tigers | మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్( Bandhavgarh Tiger Reserve ) రాయల్ బెంగాల్ టైగర్స్( Royal Bengal Tigers )కు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధికంగా ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు అధికంగా ఉన్నాయి. ఈ పులులతో పాటు ఇతర జంతువులు కూడా ఈ టైగర్ రిజర్వ్‌లో సేద తీరుతున్నాయి. అయితే పులులను, ఇతర జంతువులను లక్ష్యంగా చేసుకుని వేటగాళ్లు( Poachers ) వేటాడుతుంటారు. అది కూడా ఫారెస్టు అధికారుల( Forest Officers ) కళ్లుగప్పి. ఈ నేపథ్యంలో బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్‌కు ఓ శునకం కాపలాగా ఉంటుంది. వేటగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ.. కటకటలాపాలు చేస్తుంది ఈ కుక్క. మరి ఆ కుక్క( Dog ) యొక్క నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.
షాడోల్ ఫారెస్ట్ సర్కిల్( Shahdol Forest Circle ) పరిధిలోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రద్ధా పెండ్రే మాట్లాడుతూ.. బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్‌లో పులులకు, ఇతర జంతువులకు రక్షణగా ఉంటున్న శునకం పేరు జెనీ( Genie ). ఇది చాలా తెలివి గలది. జెనీ తెలివితేటలకు అధికారులు ఫిదా అవ్వడమే కాదు.. వేటగాళ్లు వణికిపోతున్నారు. జెనీ 2019 ఏప్రిల్ 15 నుంచి 2020 జనవరి 14 వరకు శిక్షణ పొందింది. 2020 జనవరి నుంచి షాడోల్ ఫారెస్టులో పని చేస్తుంది. ప్రస్తుతం బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్‌లో పులులకు రక్షణగా నిలుస్తూ.. వేటగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
2020 నుంచి ఇప్పటి వరకు నమోదైన 121 కేసుల్లో 66 కేసులను పరిష్కరించడంలో జెనీ కృషి ఉంది. 248 మంది వేటగాళ్ల అరెస్టులో కీలకపాత్ర పోషించింది జెనీ. ఇందులో ఏడుగురు పులుల వేటగాళ్లు, 12 మంది చిరుతల వేటగాళ్లు, 10 మంది ఎలుగుబంట్ల వేటగాళ్లు, 9 మంది అడవి పందుల వేటగాళ్లు, ముగ్గురు చితల్ వేటగాళ్లు, పాంగోలియన్, నీల్గై, బైసన్, ఏనుగుల వేటగాళ్లు ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు. బాంధవ్‌గర్హ్‌లోని ఏడు కేసుల రహస్యాన్ని ఛేదించడానికి కుక్క సేవలను తీసుకున్నారు పోలీసులు. వాటిల్లో మూడు కేసుల్లో వేటగాళ్లను జెనీ గుర్తించింది.
బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ పీకే వర్మ మాట్లాడుతూ.. బాంధవ్‌గర్హ్ టైగర్ రిజర్వ్‌లో పులులను, ఇతర జంతువులను వేటగాళ్ల నుంచి రక్షించడంలో జెనీ పాత్ర ఎంతో ఉంది. చాలా క్లిష్టమైన కేసులను పరిష్కరించడంలో సహాయపడిందన్నారు. జెనీ చాలా తెలివైన, శక్తివంతమైన కుక్క అని పీకే వర్మ పేర్కొన్నారు.
జెనీ శునకం( Genie Dog ).. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందింది. ఈ కుక్క చాలా చురుకైనది, తెలివైనది, చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఈ జాతికి చెందిన మగ కుక్కలు 24 నుండి 26 అంగుళాల పొడవు, 60 నుండి 80 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఆడ కుక్కలు దాదాపు 22 నుండి 24 అంగుళాల పొడవు, 40 నుండి 60 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. ఈ జాతి శునకాల జీవిత చక్రం 10 నుండి 14 సంవత్సరాలు.