Maoist Sunita | మావోయిస్టు కీలక నేత సునీత లొంగుబాటు

కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' ప్రభావంతో మరో కీలక మావోయిస్టు నేత సునీత లొంగిపోయింది. రూ.14 లక్షల రివార్డు ఉన్న సునీత తన ఆయుధాలతో పోలీసుల ముందు లొంగింది.

Maoist Sunita | మావోయిస్టు కీలక నేత సునీత లొంగుబాటు

విధాత : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా అనుచరులతో కలిసి లొంగిపోతున్న క్రమంలో తాజాగా 23 ఏళ్ల మావోయిస్టు సునీత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోయింది. కేవలం 20 ఏళ్లకే దళంలో చేరి పలు దాడుల్లో కీలక పాత్ర పోషించిన సునీతపై రూ.14 లక్షల రివార్డు ఉంది. అందులో మహారాష్ట్రలో రూ.6 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 3 లక్షల రివార్డు ఉంది.

ఛత్తీస్‌గఢ్‌కు బీజాపూర్ జిల్లా భైరామ్ గఢ్ గోమేటాకు చెందిన సునీత పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ దర్ బాడీగార్డ్‌గా పనిచేసింది. మధ్యప్రదేశ్ పోలీసుల ప్రత్యేక మావోయిస్టు వ్యతిరేక విభాగం హాక్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండర్ రూపేంద్ర ధుర్వే ముందు తన ఆయుధం ఐఎన్ ఎస్ఏఎస్ తుపాకితో పాటు మూడు మ్యాగజైన్‌లు,ఒక యూబీజీఎల్ షెల్‌ తో సునీత లొంగిపోయినట్లుగా ఆయన తెలిపారు. అమె చత్తీస్ గఢ్ గోండియా, రాజనందగావ్ బాలాఘాట్ డివిజన్ సభ్యురాలుగా ఉన్నారన్నారు. ఈ డివిజన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జోన్‌లో భాగంగా ఉందని తెలిపారు. తొలుత సునీత ఆయుధం లేకుండా లొంగుబాటుకు వచ్చారని..తర్వాత మనసు మార్చుకుని మా బృందానికి తన ఆయుధాలు దాచిన చోటుకు తీసుకెళ్లి వాటిని తమకు స్వాధీన పరిచిందని వెల్లడించారు. ఆగస్టు 2023లో కొత్త పునరావాస విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఇదే మొదటి లొంగుబాటు కేసు అని తెలిపారు.