పసడి మోత..! భారీగా పెరిగిన ధర..! హైదరాబాద్‌లో తులం ఎంతంటే..?

విధాత: మధ్యప్రాశ్చయంలో పాలస్తీనా – ఇజ్రాయెల్ యుద్ధంతో యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ దిగిరావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసడి ధర పెరుగుతున్నది. ప్రస్తుతం ఔన్స్‌కు 1,868 డాలర్లకు చేరింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది. గత మూడునాలుగు రోజులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300 పెరిగి తులానికి రూ.53,800 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.330 పెరుగుదల నమోదై రూ.58,530కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.53,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,680 పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.53,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.58,690కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,530 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,530కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,530 పలుకుతున్నది. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75,500 వద్ద కొనసాగుతున్నది.