gold silver prices record high| బంగారం, వెండి ధరల రికార్డు హైప్.. ఒక్క రోజునే రూ.20వేలు పెరిగిన వెండి
మరోసారి బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. శుక్రవారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.5,400పెరిగి.. ధరూ. 1,59,710కి చేరింది. కిలో వెండి ధర ఒక్క రోజున రికార్డు స్ధాయిలో ఏకంగా రూ.20,000పెరిగి రూ.3,60,000కు చేరింది.
విధాత, హైదరాబాద్ : మరోసారి బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. శుక్రవారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.5,400పెరిగి.. ధరూ. 1,59,710కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,950పెరిగి.. రూ.1,46,400కు పెరిగింది.
ఒక్క రోజునే రూ.20వేలు పెరిగిన వెండి ధర
వెండి ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. శుక్రవారం ఒక్క రోజున రికార్డు స్ధాయిలో ఏకంగా రూ.20,000పెరిగిన కిలో వెండి ధర రూ.3,60,000కు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, ఇరాన్‌లో ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య విధానాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు వంటి ప్రపంచ పరిణామాలు వెండి, బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram