PM-KISAN | రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ నిధులు జూన్‌లో విడుద‌ల‌..!

PM-KISAN | రైతుల‌కు( Farmers ) శుభ‌వార్త‌.. పీఎం కిసాన్( PM - KISAN ) ప‌థ‌కం కింద అందించే పంట పెట్టుబ‌డి సాయం త్వ‌ర‌లోనే అన్న‌దాత‌ల( Farmers ) ఖాతాలో జ‌మ కానుంది. జూన్‌( June )లో ఈ నిధులు విడుద‌ల చేసేందుకు కేంద్రం( Union Govt ) ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

PM-KISAN | రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ నిధులు జూన్‌లో విడుద‌ల‌..!

PM-KISAN | భార‌త‌దేశానికి వెన్నెముక అన్న‌దాత‌లే( Farmers ). ఈ దేశంలో 80 శాతం మంది వ్య‌వ‌సాయం( Agriculture ) పైనే ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్నారు. అలాంటి అన్న‌దాత‌ల‌ను ఆదుకోవాల‌నే ఉద్దేశంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు( Farmers ) మేలు కూర్చే విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను( Welfare Schemes ) అమ‌లు చేస్తున్నాయి. వ్య‌వ‌సాయ పెట్టుబ‌డికి ఉప‌యోగ ప‌డే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం( Union Govt ).. ప్ర‌ధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న(PM-KISAN ) ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏడాదికి ఎక‌రానికి రూ. 6 వేల చొప్పున మూడు విడుత‌ల్లో కేంద్రం రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తుంది. అంటే నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి ఈ పంట పెట్టుబ‌డి సాయాన్ని కేంద్రం అన్న‌దాత‌ల‌కు అందిస్తుంది. ఈ క్ర‌మంలో 20వ విడుత నిధుల కోసం అన్న‌దాతలు ఎదురుచూస్తున్నారు. 19వ విడుత నిధులు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌య్యాయి. అంటే 20వ విడుత( 20th instalment release ) నిధులు జూన్‌లో విడుద‌ల అవుతాయి. ఇందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

e-KYC త‌ప్ప‌నిస‌రి

జూన్ నెల‌లో ఎప్పుడైనా ప్ర‌ధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న( PM – KISAN ) నిధులు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఈ లోపు అన్న‌దాత‌లు e-KYC చేయించుకోవ‌డం ఉత్త‌మం. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ది పొందుతున్న రైతులు e-KYC చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కొత్త‌గా ల‌బ్ది పొందాల‌నుకునే వారు మాత్ర‌మే e-KYC చేయించుకుని, సంబంధిత అధికారుల వ‌ద్ద తమ భూమి వివ‌రాల‌ను న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

19వ విడుత కింద 9.8 కోట్ల మంది రైతుల‌కు ల‌బ్ది

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పీఎం కిసాన్( PM – KISAN ) నిధులు విడుద‌ల చేశారు. 9.8 కోట్ల మంది రైతుల‌కు రూ. 22 వేల కోట్లు విడుద‌ల చేశారు. ఇందులో మహిళా రైతులు( Female Farmers ) 2.41 కోట్ల మంది ఉన్నారు. 18వ విడుత కింద 9.4 కోట్ల మంది రైతుల‌కు రూ. 20 వేల కోట్ల నిధులు విడుద‌ల చేశారు. 18వ విడుత నిధులు 2024 అక్టోబ‌ర్ 5వ తేదీన విడుద‌ల‌య్యాయి. పీఎం కిసాన్( PM – KISAN ) ప‌థ‌కాన్ని 2019 ఫిబ్ర‌వ‌రి నెల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ( Narendra Modi ) ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

పీఎం కిసాన్ ప‌థ‌కంలో ల‌బ్ది పొందాలంటే ఇవి త‌ప్ప‌నిస‌రి..

రైతు పేరు, అత‌ని భార్య పేరు, పుట్టిన తేదీ
బ్యాంకు ఖాతా నంబ‌ర్
ఐఎఫ్ఎస్‌సీ / ఎంఐసీఆర్ కోడ్
మొబైల్ నంబ‌ర్
ఆధార్ నంబ‌ర్
ప‌ట్టాదార్ పాస్ బుక్ వివ‌రాలు