‘క్రెటా’ కారు క‌ట్నంగా ఇవ్వ‌లేద‌ని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వ‌రుడు

పెళ్లి అన‌గానే క‌ట్న‌కానుక‌లు గుర్తుకు వ‌స్తాయి. అల్లుడు డిమాండ్ చేసిన క‌ట్నాన్ని అమ్మాయి త‌ల్లిదండ్రులు ఇవ్వాల్సిందే. ఇవ్వ‌కున్న కొంద‌రు స‌ర్దుకుపోతారు. కానీ ఈ పెళ్లి కొడుకు మాత్రం అత్తింటి వారికి షాకిచ్చాడు. క్రెటా కారు క‌ట్నంగా ఇవ్వ‌లేద‌ని చెప్పి.. పెళ్లిని క్యాన్సిల్ చేశాడు వ‌రుడు.

‘క్రెటా’ కారు క‌ట్నంగా ఇవ్వ‌లేద‌ని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వ‌రుడు

ల‌క్నో : పెళ్లి అన‌గానే క‌ట్న‌కానుక‌లు గుర్తుకు వ‌స్తాయి. అల్లుడు డిమాండ్ చేసిన క‌ట్నాన్ని అమ్మాయి త‌ల్లిదండ్రులు ఇవ్వాల్సిందే. ఇవ్వ‌కున్న కొంద‌రు స‌ర్దుకుపోతారు. కానీ ఈ పెళ్లి కొడుకు మాత్రం అత్తింటి వారికి షాకిచ్చాడు. క్రెటా కారు క‌ట్నంగా ఇవ్వ‌లేద‌ని చెప్పి.. పెళ్లిని క్యాన్సిల్ చేశాడు వ‌రుడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన ఓ యువ‌కుడికి వివాహం నిశ్చ‌య‌మైంది. అయితే క‌ట్నం కింద హ్యుంద‌య్ క్రెటా కారును పెడుతామ‌ని అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకున్నారు. కానీ పెళ్లి స‌మ‌యానికి క్రెటాకు బ‌దులుగా మారుతి వాగ‌న్ ఆర్ కారును ఇస్తున్న‌ట్లు పెళ్లి కుమారుడికి తెలిసింది.

దీంతో అమ్మాయి ఇంటికి బ‌య‌ల్దేరే ముందు అంద‌రికీ షాకిచ్చాడు వ‌రుడు. బ‌రాత్‌ను క్యాన్సిల్ చేశాడు. త‌న‌కు క్రెటా కారు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని మొండికేశాడు. ఈ విష‌యం వ‌ధువుకు తెలియ‌డంతో ఆమె తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ముహుర్తానికి మ‌రి కొద్ది నిమిషాల్లోనే వ‌రుడు పెళ్లి చేసుకోన‌ని చెప్ప‌డంతో వ‌ధువు బోరున విలపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

త‌న‌కు న్యాయం చేయాల‌ని వ‌ధువు డిమాండ్ చేస్తోంది. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పెళ్లి కుమారుడు ప‌రారీలో ఉన్నాడు. ఎలాంటి కారణం లేకుండా పెళ్లి క్యాన్సిల్ చేశాడ‌ని, ఈ విధంగా పెళ్లి రద్దు చేసుకున్న వ్యక్తికి శిక్ష పడాలని వ‌ధువు డిమాండ్ చేస్తోంది.