Marriage Function | పెళ్లిలో కూల‌ర్ తెచ్చిన తంటా.. గాలిలో ఎగిరిన కుర్చీలు.. వీడియో

Marriage Function | ఓ పెళ్లి వేడుక‌( Marriage Function )లో కూల‌ర్( Cooler ) తంటా తెచ్చింది. దాంతో అక్క‌డున్న కుర్చీలన్ని( Chairs ) గాలిలో ఎగిరిప‌డ్డాయి. కూల‌ర్ తెచ్చిన తంటాకు గాల్లో కుర్చీలు ఎగ‌ర‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? మీరు చదువుతున్న‌ది నిజ‌మే.. ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి మ‌రి..

  • By: raj |    national |    Published on : Jun 01, 2025 2:47 PM IST
Marriage Function | పెళ్లిలో కూల‌ర్ తెచ్చిన తంటా.. గాలిలో ఎగిరిన కుర్చీలు.. వీడియో

Marriage Function | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh ) లోని ఝాన్సీ(Jhansi )లో ఈ నెల 28న ఓ వివాహ వేడుక( Marriage Function ) జ‌రిగింది. అయితే పెళ్లి మండ‌పం వ‌ధూవ‌రుల‌కు( Newly Married Couple ) సంబంధించిన కుటుంబ స‌భ్యులు, అతిథుల‌తో( Guests ) నిండిపోయింది. ఇక ఉక్క‌పోత తీవ్రంగా ఉండ‌డంతో వ‌ధూవరుల‌కు చ‌ల్ల‌ని గాలి వీచేలా ఓ కూల‌ర్‌( Cooler )ను ఏర్పాటు చేశారు.

అయితే ఆ కూల‌ర్ గాలి వ‌ధూవ‌రుల‌కు త‌గ‌ల‌కుండా.. దానికి అడ్డుగా వ‌ధువు బంధువులు, స్నేహితులు కూర్చున్నారు. కొంచెం పక్క‌కు జ‌రిగి కూర్చొండి అని వారికి చెప్ప‌గా.. వారిలో ఆగ్ర‌హావేశాలు క‌ట్ట‌లు తెంచుకున్నాయి. వ‌ధువు బంధువుల‌పై కుర్చీల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. సినిమా లెవ‌ల్‌లో ఒక్కో కుర్చీ గాల్లో ఎగిరిప‌డింది. దీంతో అక్క‌డ భోజ‌నం చేస్తున్న వారు కూడా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై పారిపోయారు.

ఈ వివాదంలో నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అతిథులు ఊపిరి పీల్చుకున్నారు. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ‌ధువు కుటుంబ స‌భ్యులు ఎస్ఎస్పీ ఆఫీసును కోరిన‌ట్లు తెలిసింది. ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు ఓ లుక్కేయండి..