Kedarnath | కేదార్‌నాథ్‌లో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
కేదార్‌నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో గాల్లో గింగిరీలు కొట్టిన హెలికాప్టర్‌ను పైలట్ చాకచక్యంగా అదుపు చేసి ల్యాండింగ్ చేశాడు.

పైలట్ చాకచక్యంతో సేఫ్ ల్యాండింగ్
విధాత: కేదార్‌నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో గాల్లో గింగిరీలు కొట్టిన హెలికాప్టర్‌ను పైలట్ చాకచక్యంగా అదుపు చేసి ల్యాండింగ్ చేశాడు. హెలిప్యాడ్‌లో కాకుండా పక్కన మట్టి దిబ్బలో అటు అటు నేలకు తాకుతూ ఎక్కడ పేలిపోతుందేమోనన్న టెన్షన్‌తో సేఫ్‌గా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కేదార్‌నాథ్ దర్శనం కోసం వారు హెలికాప్టర్ ద్వారా ఆలయానికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ గాల్లో గింగిరీలు కొట్టడం..హెలిప్యాడ్ నుంచి అక్కడున్న సిబ్బంది ఎక్కడా చాపర్ తమపై పడుతుందన్న భయాందోళనతో పరుగులు తీయడం..అతి కష్టం మీద అది సేఫ్ ల్యాండ్ అయిన వీడియ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.